2021లో అత్యంత చెత్త సినిమా ఏంటో తెలుసా..?

2021 కరోనా సెకండ్ వేవ్ లో అల్లాండించిన టైమ్. పైగా సెకండ్ వేవ్ లో మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవించాయి. అయినా ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చిన గ్యాప్ లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే కొన్ని హిట్ మనీ.. మరికొన్ని ఫట్ మనీ అనిపించుకున్నాయి. అలాగని మరీ ఏ చిత్రానికి దారుణమైన రెవిన్యూ రాలేదు. అయితే సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఓ సినిమా 2021కే కాదు.. ఏ యేడాదిలోనూ ఊహించనంత డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్.
ఆగస్ట్ 19న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని పట్టించుకున్నవారు లేరు. ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చిన గ్యాప్ లో చాలా సినిమాలు హిట్ అయ్యాయి కదా.. ఆ సెంటిమెంట్ సెకండ్ వేవ్ తర్వాతా కంటిన్యూ అవుతుంది అనుకున్నారో ఏమో.. వీళ్లు ధైర్యంగా థియేటర్స్ కు వచ్చారు. బట్ థియేటర్స్ లోకి రావడానికి ధైర్యంతో పాటు సినిమాలో కంటెంట్ కూడా అవసరం అని మర్చినట్టున్నారు. అందుకే ఈ చిత్రానికి రేటింగ్స్ దారుణంగా వచ్చాయి. దీనికి తోడు లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే రావడంతో చాలామంది భయపడ్డారు అనేది నిజం.
1970 -80ల కాలంలో సాగే కథగా వచ్చిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాలో థ్రిల్ లేకపోవడంతో జనం పట్టించుకోలేదు. రంజిత్ తెవారీ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇక అక్షయ్ కుమార్, లారాదత్తా, వాణికపూర్, హ్యూమా ఖురేషీ వంటి తారలున్నా.. ప్రేక్షకులు ఈ బెల్ బాటమ్ వైపు చూడలేదు. దీంతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లిస్ట్ లో గ్రాండ్ గా ఎంటర్ అయిందీ చిత్రం.
బెల్ బాటమ్ చిత్రానికి అయిన బడ్జెట్ 170 కోట్లు. ఇక ఓవర్శీస్ తో కలిపి ఈ మూవీ కలెక్ట్ చేసిన మొత్తం 50 కోట్లు. ఓ టాప్ హీరో సినిమాకు ఇంతకు మించిన అవమానం ఏముంటుందీ. ఇంక విశేషం ఏంటంటే బెల్ బాటమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ 2. 75కోట్లు. టోటల్ కలెక్షన్స్ కంటే ఇది ఇంకా అవమానం అప్పుడే జనాలు చెప్పుకున్నారు. మొత్తంగా ఇండియా నుంచి 2021లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకున్న టాప్ హీరో సినిమా ఈ బెల్ బాటమ్ అని చెప్పాలి.

Related Posts