క్రాక్ మూవీ ధైర్యంతో వస్తోన్న నాగార్జున

సరిగ్గా యేడాది ముందు కరోనా ఫస్ట్ వేవ్ నుంచి కోలుకుని అప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ అవుతున్న పరిస్థితి. 2021 జనవరికి ముందు నెలలో సోలోబ్రతుకే సో బెటర్ అంటూ సాయితేజ్ వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఆ సక్సెస్ ను బ్లాక్ బస్టర్ గా మార్చాడు రవితేజ. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. విశేషం ఏంటంటే.. ఈ సినిమా వచ్చిన టైమ్ లో థియేటర్స్ లో కేవలం 50శాతం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఉంది. అయినా ఆకట్టుకున్న క్రాక్ సూపర్ హిట్ అందుకుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు బంగార్రాజుకు వచ్చింది. ఓ రకంగా నాగార్జున ధైర్యం కూడా ఇదే.
ఈ నెల 14న సంక్రాంతి బరిలో విడుదలవుతోంది బంగార్రాజు. నాగ్ సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ గా రూపొందిన చిత్రం ఇది. నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా మరో హీరోగా నటించాడు. కృతిశెట్టి హీరోయిన్ గా రమ్యకృష్ణ నాగ్ కు జోడీగా పాత్ర పాత్రలోనే కొత్తగా కనిపించబోతోంది. ఇప్పటికే సినిమాపై ఓ రకమైన బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ ను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే బరిలోకి దిగుతున్నాడు బంగార్రాజు. నిజానికి కరోనా మరోసారి విజృంభిస్తోన్న తరుణంలో చాలా సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. దీంతో సంక్రాంతి వంటి పెద్ద సీజన్ లో చిన్న సినిమాలు కర్చీఫ్ వేశాయి. వీటిని జనం చూస్తారా అన్న డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో బంగార్రాజు బరిలో నిలవడం ఫ్యాన్స్ కూ కొత్త ఉత్సాహం తెస్తుంది. మరో విశేషం ఏంటంటే.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అన్ని థియేటర్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఉంది. ఒకవేళ ఫిఫ్టీ పర్సెంటే అని రిలీజ్ టైమ్ కు చెప్పినా ఈ మూవీకి వచ్చే నష్టం ఏం లేదు. క్రాక్ లా తమ సినిమా కూడా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు నాగ్.
నిజంగా ఇది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాదు. బడ్జెట్ కూడా భారీగా ఏం లేదు. వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ. అందుకే మరీ రికార్డులు క్రియేట్ చేయకపోయినా పెట్టిన రెవిన్యూ వచ్చినా చాలనేది నాగ్ భావన. ప్రస్తుత పెద్ద సినిమాలేం లేవు కాబట్టి. అదేమంత కష్టం కాదనుకోవచ్చు. మరి క్రాక్ ను ఫాలో అవుతూ వస్తోన్న బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ ఛాన్స్ ను అందిపుచ్చుకుంటాడా లేదా అనేది చూడాలి.

Related Posts