ఫ్యాన్స్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ఆయ‌న సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉన్నారు. రెండింటినీ చ‌క్క‌గా బ్యాలెన్స్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే సినీ అభిమానులు మాత్రం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఆయ‌న న‌టిస్తోన్న సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ్ టీమ్..సెప్టెంబ‌ర్ 2న ఓ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న పీరియాడిక్ మూవీ ‘హరి హర వీర మల్లు’. ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అప్పుడెప్పుడో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించి చిన్న‌ప్రోమో నెట్టింట సెన్సేష‌న్ క్రియేట్ అయిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. ఇప్పుడు హ‌రి హ‌ర వీర మ‌ల్లు మేక‌ర్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియోను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు పండుగే. గ్లింప్స్ వ్యూస్ ప‌రంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయటం ప‌క్కా. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ హీరోయిన్స్. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ ఇందులో మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జీబు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సినిమా రిలీజ్‌పై ఎలాంటి ప్రకటన లేదు. ఇది పాన్ ఇండియా మూవీగానే ప్రేక్షకులు ముందుకు రానుంది.

Related Posts