ప్యాన్ ఇండియా.. ఈ పదం వణికిపోతోన్న బాలీవుడ్

ప్యాన్ ఇండియా.. ఏ ముహూర్తాన ఈ పదం వచ్చిందో కానీ.. అప్పటి నుంచి బాలీవుడ్ కాస్త ఆందోళనగానే ఉంటోంది. మొదట్లో ఏదో ఒకటీ రెండు సినిమాలతో ఆగిపోతుందిలే అనుకున్నారు. కానీ బాహుబలితో మొదలైన ఈ మాట.. ఇప్పుడు రోజు రోజుకూ పెరుగుతోంది. మరి ప్యాన్ ఇండియా అంటే కంట్రీ మొత్తం వస్తుంది కదా.. ఎందుకు బాలీవుడ్ కు భయం అనుకుంటున్నారేమో. ఇండియా అంతా వస్తుంది. కానీ మన సినిమాలు అక్కడ ఆడుతున్నంతగా వారి సినిమాలు ఇక్కడ ఆడటం లేదు. ఆ మాటకొస్తే అక్కడా ఆడటం లేదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కు మాస్ మూవీస్ అంటే ఇలా ఉంటాయా అనిపించేలా మనోళ్లు, యాక్షన్ ను ఎమోషన్ ను, ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేసి వినోదం అందిస్తున్నారు. కానీ బాలీవుడ్ లో అలా కనిపించదు. కనిపించినా.. యాక్షన్ మూవీస్ మరీ ఎక్స్ ట్రీమ్ గా ఉంటాయి. అందుకు ఈ మధ్య కాలంలోనే వచ్చిన అనేక సినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి. అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి.

ఆర్ఆర్ఆర్ తో నాకేం పని అంటూ తెలుగు సౌత్ సినిమాలు చిన్నవి అన్న ధోరణిలో చూసిన జాన్ అబ్రహాం లేటెస్ట్ మూవీ అటాక్ కు ఆర్ఆర్ఆర్ పదో రోజు వచ్చిన కలెక్షన్స్ కూడా రాలేదు హిందీలో. కేవలం మూడు కోట్లు ఓపెనింగ్ రోజు వచ్చిన అమౌంట్. దీనికి తోడు వారి సినిమాలు తెలుగులోనో లేక మరో సౌత్ లాంగ్వేజ్ లోనో డబ్ చేస్తే ఇక్కడ ఎవరూ చూడటం లేదు. ఇదో బాధ వారికి. మరి మన ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే ఇక్కడ మాత్రం ఎందుకు చూడరు.. అనే లాజిక్ మాత్రం వదిలేస్తున్నారు.
ఈ కారణంగానే ఇప్పుడు బాలీవుడ్ వారు సౌత్ పై కొంత కక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ హిందీ భాషపై కన్నడ సూపర్ స్టార్ సుదీప్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. అజయ్ దేవ్ గణ్ చేసిన ట్వీటే. అదీ హిందీలో ఉంది. పైగా హిందీని జాతీయ భాషగా ఒప్పుకోనప్పుడు మీ సినిమాలు ఇక్కడ ఎందుకు డబ్ చేస్తున్నారు అంటూ మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టి విచిత్ర ప్రశ్న వేశాడు.. చూస్తోంటే మరింత మంది బాలీవుడ్ స్టార్స్.. సౌత్ సినిమాలపై తమ అక్కసును ఏదోలాగా వెల్లగక్కేలా కనిపిస్తున్నారు.

Related Posts