ఆచార్య వల్ల నెక్ట్స్ వీక్ కు ఊపొచ్చింది..

పెద్ద సినిమాల హిట్ టాక్స్ ను బట్టే చిన్న సినిమాల మేకర్స్ రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటారు. ఆచార్య మూవీ టాక్ వల్ల అని చెప్పలేం కానీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న సినిమాలు వచ్చే వారం సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే రెండు మూవీస్ బరిలో ఉంటే లేటెస్ట్ గా మరో సినిమా పోటీకి వచ్చేసింది. మరి ఈ త్రిముఖ చిత్ర పంచాయితీ బాక్సాఫీస్ రచ్చబండ వద్ద సూపర్బ్ అనిపించుకునేది ఎవరు..?


యాంకర్ గా తిరుగులేని స్థానంలో ఉన్న సుమ.. అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తుంది. కానీ ఈ సారి మెరుపులా కాక ప్రధాన పాత్రలో కనిపించబోతోన్న సినిమా జయమ్మ పంచాయితీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ గ్రామీణ నేపథ్యంలో చెప్పబోతోన్న కథగా ఈ సినిమా రాబోతోంది. యాంకర్ గా కంటిన్యూస్ గా మాట్లాడే సుమలో ఓ మంచి నటిని కూడా చూపించే చిత్రంలా కనిపిస్తోందీ జయమ్మ పంచాయితీ. ఈ చిత్రం మే 6న విడుదల కాబోతోంది.
జయమ్మతో బాక్సాఫీస్ పంచాయితీకి గతంలోనే రెడీ అయిన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. విశ్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన సినిమా ఇది. ఈ చిత్రం ప్రోమోస్, పాటలు, ట్రైలర్ కూ చాలాచాలా ఆకట్టుకున్నాయి. ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి మధ్య పెళ్లిచూపులు, ప్రేమ, పెళ్లి వంటి అంశాల నేపథ్యంలో వస్తోన్న చిత్రంలా కనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై చాలా వరకూ అంచనాలు పెరిగాయనే చెప్పాలి. ఈ అశోకవనంలో అర్జున కళ్యాణానికి కూడా మే 6నే ముహూర్తంగా సెట్ చేశారు.


ఇక ఈ రెండు చిత్రాలతో పాటు లేటెస్ట్ గా బరిలోకి వచ్చింది భళా తందనాన సినిమా. శ్రీ విష్ణు, కేథరీన్ జంటగా నటించారు. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం ఇది. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే శ్రీ విష్ణు నుంచి మరో వైవిధ్యమైన చిత్రం వస్తున్నట్టుగా అర్థమైంది. ఇప్పటి వరకూ కామ్ గానే ఉన్న వీళ్లు సడెన్ గా మే 6న వస్తున్నట్టు ప్రకటించారు. కమర్షియల్ గా ఎలా ఉన్నా.. కంటెంట్ పరంగా ఆకట్టుకునే చిత్రాల్లానే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ముగ్గురులో బాక్సాఫీస్ ఎవరికి ఓటు వేస్తుందో కానీ.. మూడూ వైవిధ్యమైన చిత్రాలే అని చెప్పాలి.

Related Posts