కామెడీ స్టార్స్ ఒక్కొక్కరిగా హీరోలుగా మారుతున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు వైవా హర్ష కూడా చేరాడు. ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో వైవా హర్ష హీరోగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‘. హర్షకి జోడీగా దివ్య శ్రీపాద నటించింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఫిబ్రవరి 23న విడుదలకు ముస్తాబైన ‘సుందరం మాస్టర్‘ ట్రైలర్ రిలీజయ్యింది.
ఓ ఆదివాసీ గ్రామంలో మాస్టర్ గా ఎంటరవుతాడు సుందరం. ఇంగ్లీష్ ఎంతో ఫ్లూయెంట్ గా మాట్లాడే ఆ గ్రామవాసుల ఆచార వ్యవహరాలు సుందరంకు చాలా కొత్తగా అనిపిస్తాయి. మరి.. సుందరం మాస్టర్ కి ఆ గ్రామంలో ఎదురైన సంఘటనలేంటి? వాటిని అతను ఎలా అధిగమించాడు? అనే సరికొత్త కథాంశంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. మొత్తంగా ‘సుందరం మాస్టర్‘ ట్రైలర్ ఆద్యంతం వైవా హర్ష ఫన్ రైడ్ తో ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్ మెంట్ పంచుతోంది.