దేవిశ్రీ ను పక్కన పెట్టిన బాలయ్య.. లైన్ లోకి మళ్ళీ తమన్.. అసలు కారణాలు ఇవే..!!

ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర కథానాయకులందరికీ.. ఇద్దరే ఇద్దరు సంగీత దర్శకులు కావాలి. అందులో ఒకరు దేవిశ్రీప్రసాద్ అయితే.. మరొకరు ఎస్.తమన్. దేవిశ్రీప్రసాద్ రెండున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ ని దున్నేస్తుంటే.. తమన్ పుష్కర కాలంగా తెలుగులో అగ్ర కథానాయకుల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇక లేటెస్ట్ గా NBK 109 విషయంలో ఈ ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు మరోసారి వార్తల్లోకి వచ్చారు.

NBK 109.. నటసింహం నందమూరి బాలకృష్ణ 109వ చిత్రమిది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడనే ప్రచారం జరిగింది. అందుకు ప్రధాన కారణం.. బాబీ దర్శకత్వం వహించిన గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కి అతను అద్భుతమైన సంగీతం, నేపథ్యం సంగీతం అందించడమే.

అయితే.. ఏమైందో ఏమో ఇటీవల శివరాత్రి కానుకగా ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నాడని ప్రకటించింది చిత్రబృందం. అంతేకాదు.. తమన్ నేపథ్య సంగీతంలో గ్లింప్స్ కూడా రిలీజైంది. NBK 109 ఫస్ట్ గ్లింప్స్ అయితే అదిరిపోయింది. ఎప్పటిలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేశాడు తమన్. మొత్తానికి నటసింహం బాలకృష్ణకు వరుసగా ‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించడంలో కీలక పాత్ర పోషించిన తమన్ నే.. ఏరికోరి బాలయ్య NBK 109కి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది.

Related Posts