ఆస్కార్ వేడుకలో ‘ఓపెన్‌హైమర్’కి అవార్డుల పంట

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వేడుక ఆస్కార్ అవార్డులు. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆస్కార్ అవార్డ్స్ -2024 విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. బ్లాక్ బస్టర్ హిట్ ‘ఓపెన్‌హైమర్’కు 96వ ఆస్కార్ అవార్డుల్లో అవార్డుల పంట పండింది.

హాలీవుడ్ లో ‘ది బ్యాట్ మ్యాన్’ సిరీస్, ‘ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డన్‌కిర్క్, టెనెట్’ వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన చిత్రమే ‘ఓపెన్‌హైమర్’. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త ‘రాబర్ట్ జె ఓపెన్ హైమర్’ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఓపెన్‌హైమర్’.. ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటుడుగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ కి లుడ్విక్ గోరాన్సన్ అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ నటిగా ‘పూర్ థింక్స్’ చిత్రానికి గానూ ఎమ్మా స్టోన్ అవార్డు అందుకోగా.. ఉత్తమ సహాయ నటిగా ‘ది హోల్డోవర్స్’ చిత్రానికి గానూ డా వైన్ జాయ్ రాండోల్ఫ్ అవార్డు అందుకున్నారు. ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో అవార్డు బరిలో నిలిచిన ‘టు కిల్‌ ఏ టైగర్�