“పుష్ప” రెండో రోజు నైజాం క‌లెక్ష‌న్స్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఇందులో బ‌న్నీ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక న‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా రికార్డ్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో కూడా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో భారీ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

మొదటి రోజు ఈ చిత్రం నైజాం నుంచి అయితే 11 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు సాధించింది. ఇక ఇపుడు నైజాంలో రెండో రోజు కూడా భారీగానే కలెక్షన్ రాబ‌ట్టింది. ఇంత‌కీ ఎంత రాబ‌ట్టిందంటే.. నైజాంలో రెండో రోజుకి గాను 6.5 కోట్ల షేర్ ని రాబట్టింద‌ని స‌మాచారం. ఇక మూడో రోజు ఆదివారం కాబ‌ట్టి భారీ వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం ఖాయం అని చెప్ప‌చ్చు. ఓవరాల్ గా పుష్ప రాజ్ లెక్క భారీ ఫిగర్ దగ్గరే ఆగే అవకాశం ఉంది.

ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ గా 71 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. రెండో రోజు కూడా భారీగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఫ‌స్ట్ వీక్ ఎంత క‌లెక్ట్ చేస్తుంద‌నే ఆస‌క్తిగా మారింది. అలాగే సోమ‌వారం పుష్ప రాజ్ కి అస‌లైన ప‌రీక్ష‌. మండే టెస్ట్ పాస్ అయితే.. పుష్ప రాజ్ కి ఎదురే ఉండ‌దు.

Related Posts