వరుసగా ఫ్లాపులు వస్తున్నా.. సినిమాలు తగ్గని హీరోల్లో నితిన్ కూడా ఉంటాడు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. కానీ కథల విషయంలో మాత్రం ఓ ఖచ్చితత్వాన్ని పాటించలేపోతున్నాడు నితిన్.ఈ కారణంగానే ఇన్ని ఫ్లాపులు. వైఫల్యాలపై కాస్త సమీక్ష చేసుకుని మంచి కథలు సెలెక్ట్ చేసుకోవడం లేదా.. ఎవరైనా మంచి సలహాదారులను పెట్టుకుంటే మంచిది అనే కమెంట్స్ కంటిన్యూస్ గా వినిపిస్తూనే ఉన్నాయి. బట్ ఓ మూవీ ఫ్లాప్ కు చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి..
ఎవరూ ఇది ఖచ్చితంగా హిట్ అని డిసైడ్ చేయలేరు. రీసెంట్ గా మాచర్ల నియోజకగర్గం మూవీతో వచ్చాడు నితిన్. ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ లోనూ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. బట్.. ఫస్ట్ షో కే డిజాస్టర్ గా డిక్లేర్ అయిందీ చిత్రం. పైగా ఈ చిత్రానికి నిర్మాత కూడా తనే. దీంతో రెండు విధాలుగా లాస్ అయ్యాడు. దీంతో మరోసారి అతని పరిస్థితి ఇష్క్ చిత్రానికి ముందున్నట్టుగా మారింది. అందుకే ఈ సారి వెంటనే సినిమాలు ఒప్పుకోవడం లేదు. కాస్త ఆచితూడి అడుగేస్తున్నాడు. ఆ అడుగులో భాగంగానే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అంటున్నారు.
తొలి చిత్రం అయ్యారేతో ఆకట్టుకుని మలి చిత్రం అప్పట్లో ఒకడుండేవాడుతో మెస్మరైజ్ చేసిన దర్శకుడు సాగర్ కె చంద్ర. అతని టాలెంట్ నచ్చే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కు అవకాశం ఇచ్చారు. ఈ మూవీతోనూ సత్తా చాటిన సాగర్ ఆ తర్వాత కొత్త సినిమా ఏదీ కమిట్ కాలేదు. ఈ నేపథ్యంలో నితిన్ తో సినిమా కన్ఫార్మ్ అయిందంటున్నారు. నిజానికి నితిన్ కు ఇప్పుడు ఇలాంటి దర్శకులే అవసరం. కంటెంట్ ఉండీ.. మేకింగ్ లో ఓ ప్రత్యేక శైలి ఉన్న దర్శకులు అయితేనే నితిన్ కు బాగా సూట్ అవుతారు. ఆ విషయంలో సాగర్ కె చంద్రను ఏ మాత్రం తక్కువ చేయలేం. విషయం ఉన్న దర్శకుడుగా ఎప్పుడో పేరు తెచ్చుకున్న సాగర్ సినిమాతో అయినా నితిన్ ఫేట్ మారుతుందేమో చూడాలి.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…