ప్రశాంత్ కంటే ముందే ఎన్టీఆర్ -బుచ్చిబాబు నిజమెంత

ఆర్ఆర్ఆర్ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత మైలేజ్ ఇచ్చిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ మూవీ తర్వాత అతని నటన ప్రపంచానికి పరిచయం అయింది. ఇండియా నుంచి ఉన్న ది బెస్ట్ యాక్టర్స్ లో ఒకడుగా ప్రపంచం అంతా గుర్తించింది కూడా. అందుకే ఆస్కార్ లిస్ట్ లో కూడా చోటు సంపాదించాడు ఎన్టీఆర్. అలాంటి తను ఇకపై చేసే సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో కూడా అందరికీ తెలుసు. బట్ సడెన్ గా కొరటాల శివతో కమిట్ అయి ఆశ్చర్యపరిచాడు. అఫ్ కోర్స్ కొరటాల రీసెంట్ మూవీ ఆచార్య ఫ్లాప్ అయినంత మాత్రాన ఈ మూవీ కూడా అలాగే అవుతుందని చెప్పలేం. అయినా ఫ్యాన్స్ లో రకమైన నిరాశ కనిపించింది. అయినా ప్రశాంత్ నీల్ తో సినిమా అనౌన్స్ కావడంతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం కనిపించింది. బట్ ఇప్పుడు మరోసారి ఆ ఉత్సాహం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు బుచ్చిబాబు. ఆ టైమ్ కు ఉన్న పరిస్థితుల వల్ల ఉప్పెన బ్లాక్ బస్టర్ అయింది కానీ.. నిజానికి ఈ మూవీలో అంత స్టఫ్ లేదని అందరికీ తెలుసు. బట్ కరోనా తర్వాత వచ్చిన సినిమా కావడంతో చాలామంది విమర్శలు చేయలేదు. అయినా బుచ్చిబాబు తన తర్వాతి సినిమాను కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే చేస్తాను అని ఫిక్స్ అయిపోయాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో “పెద్ది” అనే టైటిల్ తో కథ సిద్ధం చేసుకుని ఎన్టీఆర్ కు చెప్పాడు కూడా. యంగ్ టైగర్ కొన్ని ఛేంజెస్ చెప్పాడు. వాటిని సుకుమార్ సాయంతో సరిదిద్దుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మధ్యలోకి వచ్చిందంటున్నారు.

యస్.. బుచ్చిబాబు కథ విషయంలో సుకుమార్.. ఎన్టీఆర్ కు హామీ ఇచ్చాడట. చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా చెప్పాడట. దీంతో కొరటాల తర్వాత బుచ్చిబాబుతో సినిమాకు సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్ అంటున్నారు. పైగా కొరటాల సినిమా కోసం కాస్త బరువు పెరుగుతున్నాడు.ఆ ఫిజిక్ తోనే బుచ్చిబాబు మూవీ కూడా ఉంటుందట. సో.. ఇవన్నీ నిజమే అయితే కొరటాల సినిమా మాగ్జిమం పూర్తయిన తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్ట్ మొదలవుతుంది. అతను కాస్త పక్కాగా ప్లాన్ చేసుకుని సినిమాను అనుకున్న టైమ్ కు పూర్తి చేయగలిగితే.. ప్రశాంత్ నీల్ సినిమా 2023 చివర్లో మొదలవుతుందట. అంటే 2023 లో కొరటాల మూవీ. 2024లో బుచ్చిబాబు, ప్రశాంత్ సినిమాలు విడుదలవుతాయన్నమాట.

Telugu 70mm

Recent Posts

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…

8 mins ago

బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…

34 mins ago

Pooja Hegde

49 mins ago

ఎన్టీఆర్ కు.. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…

60 mins ago

ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…

1 hour ago