భారీ బడ్జెట్ తో నాగార్జున 100వ చిత్రం

మన స్టార్ హీరోలు తమ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీస్ ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. వంద సినిమాల మైలురాయి అనేది ప్రతీ హీరో కల. టాలీవుడ్ సీనియర్స్ లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్ ని అధిగమించారు. ఇప్పుడు నాగార్జున వంతొచ్చింది. సంక్రాంతి బరిలో ‘నా సామిరంగ’ చిత్రంతో మంచి విజయాన్నందుకుని.. మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు కింగ్ నాగార్జున. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాగార్జున.. ఆ తర్వాత తన వందో సినిమాని పట్టాలెక్కించనున్నాడట.

తమిళంలో విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ కాంబోలో ‘అగ్ని సిరగుగల్’ సినిమా తీసిన నవీన్.. నాగార్జున సెంచరీ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నాగార్జున 100వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.

Related Posts