నాగచైతన్యతో పూజాహెగ్డే.. ??

కొన్ని కాంబినేషన్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఒకప్పుడు సాధారణ హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. అప్పుడు తన ఫస్ట్ మూవీగా మొదలైంది. ఒక లైలా కోసం. ఈ మూవీ లో నాగచైతన్య హీరో.ఆ టైమ్ లో పూజాకు ఏ మాత్రం క్రేజ్ లేదు. కానీ ముందుగా విడుదలైంది ముకుంద. తర్వాత వచ్చిన ఒక లైలా కోసం తనకు ఏ మాత్రం హెల్ప్ కాలేదు. డిజే తర్వాత అమ్మడి కెరీర్ టూ పీస్ బికినీలా పండగలా మారింది. ప్రస్తుతం పూజా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మరోవైపు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ రీసెంట్ గా కోలీవుడ్ లో విజయ్ సరసన బీస్ట్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అలాంటి తను ప్రస్తుతం ఆ రేంజ్ లో లేని నాగచైతన్యతో నటిస్తుందా అనే డౌట్ కొందరిలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు చైతూ రేంజ్ కూడా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ లోనూ ఇంటర్ డ్యూస్ కాబోతున్నాడు. వెబ్ సిరీస్ లకూ సై అంటున్నాడు. అలాగే ఇప్పుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తోన్న థ్యాంక్యూ సినిమాపై చాలా అంచనాలున్నాయి. అయినా ఈ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు వందశాతం ఉన్నాయంటున్నారు. కారణమేంటో తెలుసా..?
నాగచైతన్య సరసన పూజా హెగ్డే అనే ప్రాజెక్ట్ బై లింగ్వుల్ గా రాబోతోంది. అంటే తెలుగుతో పాటు తమిళ్ లోనూ రూపొందుతుందన్నమాట. మరో విశేషం ఏంటంటే.. డిఫరెంట్ కాన్సెప్ట్స్ నెక్ట్స్ లెవెల్ మేకింగ్ తో మెస్మరైజ్ చేసే దర్శకుడు వెంకట్ ప్రభు చేయబోతోన్న సినిమా ఇది.  ఓ రకంగా వెంకట్ ప్రభు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ. ఇప్పటికే వెంకట్ ప్రభు, నాగచైతన్య కాంబో ఫిక్స్ అయింది. దీనికి మరింత హైప్ పెంచాలంటే పూజాహెగ్డే బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. తనను సంప్రదించారు. ప్రస్తుతం పూజా చాలా చాలా బిజీగా ఉంది. అయినా కథ నచ్చి డేట్స్ అడ్జెస్ట్ చేస్తే ఇప్పుడు ఇండివిడ్యుల్ గా క్రేజీ అయిన ఈ కాంబోను మనం మరోసారి చూస్తామన్నమాట.
Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

9 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

14 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

14 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

16 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

18 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

19 hours ago