నాగచైతన్యతో పూజాహెగ్డే.. ??

కొన్ని కాంబినేషన్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఒకప్పుడు సాధారణ హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. అప్పుడు తన ఫస్ట్ మూవీగా మొదలైంది. ఒక లైలా కోసం. ఈ మూవీ లో నాగచైతన్య హీరో.ఆ టైమ్ లో పూజాకు ఏ మాత్రం క్రేజ్ లేదు. కానీ ముందుగా విడుదలైంది ముకుంద. తర్వాత వచ్చిన ఒక లైలా కోసం తనకు ఏ మాత్రం హెల్ప్ కాలేదు. డిజే తర్వాత అమ్మడి కెరీర్ టూ పీస్ బికినీలా పండగలా మారింది. ప్రస్తుతం పూజా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మరోవైపు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ రీసెంట్ గా కోలీవుడ్ లో విజయ్ సరసన బీస్ట్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అలాంటి తను ప్రస్తుతం ఆ రేంజ్ లో లేని నాగచైతన్యతో నటిస్తుందా అనే డౌట్ కొందరిలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు చైతూ రేంజ్ కూడా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ లోనూ ఇంటర్ డ్యూస్ కాబోతున్నాడు. వెబ్ సిరీస్ లకూ సై అంటున్నాడు. అలాగే ఇప్పుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తోన్న థ్యాంక్యూ సినిమాపై చాలా అంచనాలున్నాయి. అయినా ఈ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు వందశాతం ఉన్నాయంటున్నారు. కారణమేంటో తెలుసా..?
నాగచైతన్య సరసన పూజా హెగ్డే అనే ప్రాజెక్ట్ బై లింగ్వుల్ గా రాబోతోంది. అంటే తెలుగుతో పాటు తమిళ్ లోనూ రూపొందుతుందన్నమాట. మరో విశేషం ఏంటంటే.. డిఫరెంట్ కాన్సెప్ట్స్ నెక్ట్స్ లెవెల్ మేకింగ్ తో మెస్మరైజ్ చేసే దర్శకుడు వెంకట్ ప్రభు చేయబోతోన్న సినిమా ఇది. ఓ రకంగా వెంకట్ ప్రభు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ. ఇప్పటికే వెంకట్ ప్రభు, నాగచైతన్య కాంబో ఫిక్స్ అయింది. దీనికి మరింత హైప్ పెంచాలంటే పూజాహెగ్డే బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. తనను సంప్రదించారు. ప్రస్తుతం పూజా చాలా చాలా బిజీగా ఉంది. అయినా కథ నచ్చి డేట్స్ అడ్జెస్ట్ చేస్తే ఇప్పుడు ఇండివిడ్యుల్ గా క్రేజీ అయిన ఈ కాంబోను మనం మరోసారి చూస్తామన్నమాట.

Related Posts