‘కల్కి’లో కొత్త ప్రపంచం చూడబోతున్నారు.. నాగ్ అశ్విన్

‘కల్కి’ కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో కల్కిలో చూస్తారని.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ గొప్పగా ఎంజాయ్ చేసేలా ‘కల్కి’ ఉంటుందని.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నాడు.

తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడు. టెక్ ఫెస్ట్’23లో కల్కి 2898 AD’ ప్రత్యేక కంటెంట్ ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీట్ లో ‘కల్కి 2898 AD’ చిత్రానికి సంబధించిన విశేషాలను పంచుకున్నాడు నాగ్ అశ్విన్.

కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్ అని.. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథగా ఈ చిత్రం ఉంటుందని తెలిపాడు నాగ్ అశ్విన్. ‘కల్కి’లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతునాయో ప్రేక్షకులు చూస్తారన్నాడు. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ని బిల్డ్ చేశామని ఈ సందర్భంగా తెలిపాడు. అలాగే.. కల్కికి.. ‘2898 AD’ అనే టైమ్ లైన్ పెట్టడానికి ఒక లాజిక్ వుందని.. అయితే అది సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో చెబుతానన్నాడు.

Related Posts