‘సైంధవ్’ సాంగ్.. ఎమోషనల్ గా ఆకట్టుకుంటోన్న ‘బుజ్జి కొండవే..’

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రంగా రాబోతుంది ‘సైంధవ్’. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా.. ‘సైంధవ్’ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు.

‘బుజ్జి కొండవే..’ అంటూ తండ్రీ కూతుళ్ల బంధాన్ని తెలిపే ఈ గీతాన్ని సంతోష్ నారాయణన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రాయగా.. ఎస్.పి.చరణ్ అద్భుతంగా ఆలపించాడు. కూతురు ఆరోగ్యం ఆపదలో ఉందని తెలిసి.. తండ్రి వెంకటేష్ చూపించే ఎమోషనల్ సీన్స్ ఈ పాటలో హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. ఈ పాటలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా కనిపించింది.

Related Posts