నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓ విషయం.. మోక్షజ్ఞ ఎంట్రీ. టాలీవుడ్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన నట వారసుడిగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుందా? అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే మోక్షజ్ఞ ఎంట్రీపై నెట్టింట ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి వారసుడి సినీ ఎంట్రీ ఉంటుందని కొన్ని రోజుల ముందు వార్తలు వచ్చాయి. అలాగే క్రిష్ దర్శకత్వంలోనూ సినిమా చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. ఇలా మోక్షజ్ఞ ఎంట్రీపై దర్శకుల విషయంలో ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఒకానొక సందర్భంలో అయితే మోక్షజ్ఞకు సినిమాలంటే ఆసక్తి లేదనే న్యూస్ కూడా వచ్చింది.
అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాల దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని, అదొక ప్రేమకథా చిత్రమని టాక్. తనకు మాస్ హీరోగా ఉన్నప్పటికీ బాలయ్య.. తన కొడుకుని కొత్తగా ప్రెజంట్ చేయాలని ఆలోచిస్తున్నారట. అందులో భాగంగానే ఆయన రాహుల్ సంక్రిత్యాన్ సినిమాకు ఓకే చెప్పారని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందట.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…