సొంత రాష్ట్రంలో కూడా చతికిల బడ్డ బీస్ట్

స్థానిక బలం అనేది ఎవరికైనా బాగా ప్లస్ అవుతుంది. ఇక సినిమా స్టార్స్ లో ఇండస్ట్రీకే టాప్ స్టార్ అనిపించుకున్నవాళ్లకు అది బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు యావరేజ్, బిలో యావరేజ్ సినిమాలు ఇచ్చినా పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తమిళ్ లో విజయ్ కూడా పవన్ లాంటి ఫ్యాన్స్ ఉన్న స్టారే. అందుకే అతని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటాయి. బట్.. ఈసారి బీస్ట్ కు మినహాయింపు అంటున్నారు అక్కడి జనం.

ఈ నెల 13న విడుదలైంది బీస్ట్. రిలీజ్ కు ముందే పెద్దగా ప్రమోషన్స లేవు. సినిమాపై అంచనాలు కూడా పెంచలేకపోయారు. ట్రైలర్ కూడా యావరేజ్ గానే అనిపించింది. అప్పుడే చాలామంది ఈ సినిమాపై సందేహాలు వ్యక్తం చేశారు. అవన్నీ నిజమే అని మొదటి ఆటకే తేల్చింది బీస్ట్. తెలుగులో మొదటి రోజే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. పైగా నెక్ట్స్ డే కెజీఎఫ్ 2 ఉండటంతో ఇక కష్టమే అని తేలిపోయింది. అయితే విజయ్ కు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ వల్ల కెజీఎఫ్2 ఎఫెక్ట్ ఏం పడదు అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఈ కన్నడ స్టార్ ఇళయదలపతిని వెనక్కి నెట్టాడు. కలెక్షన్స్ తోనే కాదు.. చాలా చోట్ల థియేటర్స్ సగం కూడా ఆక్యుపై కావడం లేదట. అందుకే కొన్ని చోట్ల ఏకంగా బీస్ట్ ను తీసేసి ఆర్ఆర్ఆర్ ను మళ్లీ వేస్తున్నారని చెబుతున్నారు.

నిజానికి బీస్ట్ సినిమా అంచనాల మేటర్ ఎలా ఉంచినా.. సినిమాలో స్టఫ్ ఉంటే ఆటో మేటిక్ గా పికప్ అయ్యేదే. మేటర్ లేనప్పుడు ఏ దళపతి అయినా బాక్సాఫీస్ వార్ లో గెలవడం సాధ్యం కాదు. అది మరోసారి ప్రూవ్ అయింది. ఏదేమైనా ఈ మూవీ ఎఫెక్ట్ తో విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఆయా థియేటర్స్ లోని ఆన్ లైన్ టికెటింగ్ లో ఉన్న ఖాళీలను చూపుతూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మరోవైపు క్రిటిక్స్ కూడా బీస్ట్ సినిమాకు సంబంధించి అదే పనిగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. సో.. ఇక ఈ సినిమా గురించి మర్చిపోయి విజయ్ నెక్ట్స్ చేయబోతోన్న వంశీ పైడిపల్లి సినిమాపై కాన్ సెంట్రేట్ చేస్తే బెటర్.

Related Posts