సౌత్, నార్త్ స్టార్స్ తో భారీ మల్టీస్టారర్ ..?

ఇంకా సౌత్, నార్త్ ఏంటీ.. అంతా ఇండియన్ సినిమా అయిపోయింది కదా..? అని మనం అనుకుంటున్నాం కానీ.. ఇంకా బాలీవుడ్ వారికి ఆ మేటర్ జీర్ణం కావడం లేదు అనేది వాస్తవం. అదే టైమ్ లో కొందరు హీరోలు మాత్రం సౌత్ ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ ముందుంటాడు. తర్వాత ఆమిర్ ఖాన్ వస్తాడు. సల్మాన్ అయితే హైదరాబాద్ లో చిరంజీవి, వెంకటేష్ వంటి వారి ఇంటికి కూడా వెళుతుంటాడు. పైగా రీసెంట్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఓ పాత్ర కూడా ‘‘ఫ్రీ’’గా చేశాడు. ఇక ఈ సారి తనే ఓ తెలుగు స్టార్ ను బాలీవుడ్ కు తీసుకువెళుతున్నాడు. అతనెవరో కాదు.. మన మిస్టర్ కూల్ వెంకటేష్.

వెంకటేష్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో అడుగులు వేశాడు. తన చంటి సినిమాతో పాటు తెలుగులో సూపర్ హిట్ అయిన యమలీల సినిమాల రీమేక్స్ లో అక్కడ నటించాడు. కానీ రెండూ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఇక బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడాలేదు వెంకటేష్. మళ్లీ ఇన్నాళ్లకు.. ఆ బౌండరీస్ తగ్గుతోన్న టైమ్ లో సల్మాన్ ఖాన్ కోసం అతని సినిమాలో ఓ హీరోగా నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఆ తరం హీరోలు కాబట్టి మల్టీస్టారరే అనాలి. అలాగని సల్మాన్ కు ఉన్నంత క్రేజ్ వెంకీకి లేదు. అయినా సినిమాలో అతని పాత్రకు సమాన ప్రాధాన్యం ఉంటుందట. అందుకే వెంకీ కూడా ఓకే చెప్పినట్టు టాక్.
యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. ఫర్హాన్ సామ్జీ డైరెక్టర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. ఆల్రెడీ వెంకటేష్ కు కథ వినిపించారు. అతనూ ఓకే చెప్పాడు. ఇక హీరోయిన్లను ఫైనల్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. మొత్తంగా ఇలాంటి మల్టీస్టారర్ మూవీస్ బాలీవుడ్ లో కొత్త కాదు. కానీ ఓ సౌత్ స్టార్ హీరోతో బాలీవుడ్ హీరో మల్టీస్టారర్ చేయడం మాత్రం ఈ మధ్య కాలంలో కొత్తే. అప్పుడెప్పుడో నాగార్జున ఒకట్రెండు సినిమాలు చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు వెంకీ చేస్తున్నాడు. మరి ఈ వయసులో వెంకీ వేస్తోన్న బాలీవుడ్ స్టెప్ అతనికి ఈ సారి అక్కడ ఎలాంటి మలుపులు ఇస్తుందో చూడాలి.

Related Posts