‘భీమా’ దర్శకుడితో మాస్ మహారాజ

సిల్వర్ స్క్రీన్ పై మాస్ ఎలిమెంట్స్ ను పుష్కలంగా ఆవిష్కరించే దర్శకులు అరుదుగా ఉంటారు. ఈకాలంలో తెలుగులో బోయపాటి శ్రీను అలాంటి ఘనతను సాధిస్తే.. తమిళంలో హరి.. కన్నడలో హర్ష ఈకోవకు చెందుతారు. ఇక.. కన్నడ యాక్షన్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ హర్ష.. ‘భీమా’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ లోని మాస్ యాంగిల్ ను సరికొత్తగా ఆవిష్కరించాడట హర్ష. రేపు ‘భీమా’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘భీమా’ విడుదల కాకుండానే హర్ష తెలుగులో మరో క్రేజీ ఆఫర్ అందుకున్నాడట. మాస్ మహారాజ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే.. రవితేజాతో సినిమాకి ఇంకాస్త సమయం పడుతుందని ఇటీవల ఇంటర్యూలలో చెప్పాడు హర్ష. ఒకవిధంగా రవితేజాతో హర్ష పరిచయం ఇప్పటిది కాదు. ‘బెంగాల్ టైగర్’ సినిమా కోసం కొరియోగ్రాఫర్ గానూ వర్క్ చేశాడు. ఆ పరిచయంతోనే రవితేజాతో సినిమా చేయాలనేది అతని కోరిక అట. త్వరలోనే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే అవకాశాలున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

Related Posts