మార్చి 21న థియేటర్లలోకి ‘నువ్వు నేను’

ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నువ్వు నేను’ది ప్రత్యేక స్థానం. అప్పటికే ఉదయ్ కి ‘చిత్రం’ వంటి హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి జోడీగా అనిత నటించింది. 2001వ సంవత్సరంలో విడుదలైన ‘నువ్వు నేను’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆర్.పి.పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని ప్రతీ పాట సూపర్ హిట్టే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతోన్న రీ-రిలీజుల ట్రెండ్ లో భాగంగా ‘నువ్వు నేను’ సినిమాని మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ‘నువ్వు నేను’ చిత్రాన్ని మార్చి 21న రీ-రిలీజ్ చేయబోతున్నారు.

Related Posts