మారుతి స్వయంకృతాపరాధం.. ప్రభాస్ సినిమా దూరం

స్వయంకృతాపరాధం.. ఈ మాట సినిమా పరిశ్రమలోనే ఎక్కువగా వినిపిస్తుంది. అంతా బావుంది అనుకుంటున్నప్పుడు.. చేయకూడదు అని తెలిసీ కొన్ని మిస్టేక్స్ చేస్తే అది కెరీర్ పై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు దర్శకుడు మారుతి విషయంల కూడా అదే కనిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో మారుతి ఓ సంచలనం అనేది కాదనలేని సత్యం. చిన్న కెమెరాతో ఈ రోజుల్లో అంటూ ఓ సినిమా తీసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. తర్వాత అతని రూట్ లోనే చాలామంది వెళ్లారు కూడా. ఆ తర్వాత కూడ బస్ స్టాప్ అనే చిత్రంతో మరో విజయం అందుకున్నాడు. అయితే ఈ రెండు సినిమా కూడా అప్పటి ట్రెండ్ కు భిన్నంగా ఉన్నవి. అంటే గొప్పవని కాదు.. తెలుగు సినిమాల్లో వినిపించని.. బూతులతో మాత్రమే విజయం సాధించిన సినిమాలివి. అలాంటి బూతులతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన దర్శకులు అంతకు ముందు లేరనే చెప్పాలి. అందుకే మారుతి ఎంత త్వరగా రిజిస్టర్ అయ్యాడో.. అంతే త్వరగా విమర్శకులకు దొరికాడు. ఆ రోజుల్లో అతన్ని బూతు చిత్రాల దర్శకుడు అన్న ముద్రను బలంగా వేశారు. ఆ ముద్రను మొదట చెరిపే ప్రయత్నం చేసింది ప్రేమకథా చిత్రమ్. ఆ తర్వాత మెల్లగా బూతులు తగ్గిస్తూ.. కాస్త పెద్ద హీరోల వరకూ వచ్చాడు. ఆ లిస్ట్ ను కూడా దాటి ఏకండా ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్ వరకూ వచ్చిన తర్వాత మళ్లీ బ్యాక్ టు బూత్స్ అనడంతోనే ఈ సమస్య వచ్చింది.

నిన్న విడుదలైన పక్కా కమర్షియల్ సినిమా గోపీచంద్ కెరీర్ లోనే హయ్యొస్ట్ ఓపెనర్ అని వాళ్లు గ్రాండ్ గా ఎన్ని పోస్టర్స్ వేసుకున్నా.. సినిమా మాత్రం మళ్లీ మారుతి ఈ రోజుల్లో, బస్ స్టాప్ స్థాయి సినిమానే. అందుకే చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. సినిమాలో అసలు కంటెంట్ లేదు.. సింక్ లేని స్క్రీన్ ప్లేతో ఇబ్బంది పెట్టాడు. శ్రుతి మించిన బూతులు కూడా మైనస్ గా మారాయి. ఈ విషయంలో గోపీచంద్ ను కూడా విమర్శిస్తున్నారు కొందరు. ఖచ్చితంగా చెబితే.. మారుతి పక్కా కమర్షియల్ తో ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రశ్నార్థకంలో పడ్డాడు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మారుతితో ప్రభాస్ సినిమా చేయడాన్ని అశ్వనీదత్ వ్యతిరేకిస్తున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి. అంటే ప్రభాస్ ఆయన బ్యానర్ లో ప్రాజెక్ట్ కె అనే బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. ఈ టైమ్ లో మారుతి లాంటి దర్శకుడితో చేస్తే తమ ప్రాజెక్ట్ కు బిజినెస్ తగ్గుతుందనే భావనలో అశ్వనీదత్ ఉండటం వల్లే అతను మారుతితో సినిమాను వ్యతిరేకిస్తున్నాడంటున్నారు. ఈ టైమ్ లో పక్కా కమర్షియల్ తో స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన మారుతి ఇలా మళ్లీ వెనకటి రోజులకు వెళ్లడం అతని స్వయంకృతాపరాధమే కదా..?

Related Posts