అఖండ విజయం కోసం అదే నెలలో బాలయ్య

టాప్ హీరోల సినిమాలు షూటింగ్ లో ఉన్నాయంటే చాలు.. ముందు రిలీజ్ ఎప్పుడు అనే క్వశ్చన్స్ పెరుగుతుంటాయి. ఆ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వస్తున్నాకొద్దీ.. ఈ క్వశ్చన్స్ ఎక్కువవుతుంటాయి. మరి స్టార్స్ చేసే సినిమాలంటే మాటలా.. కరెక్ట్ టైమ్ చూసుకోవాలి.. వెనకా ముందు పోటీని గమనించాలి. అప్పుడే బరిలోకి దిగాలి. కంటెంట్ బలంగా ఉంటే సోలోగా వచ్చినా సత్తా చాటొచ్చు. లేదంటే తేడా వస్తుంది. అందుకే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ మళ్లీ అఖండ విజయం సాధించాలని అదే టైమ్ కు రాబోతున్నాడు.. బాలయ్య.నందమూరి బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో జోష్‌ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు హిట్ టాక్ వచ్చిందా.. ఇంక అంతే.. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఆ టాక్ రాలేదన్నా అంతే వేగంగా బాక్సాఫీస్ క్లోజ్ అయిపోతుంది. అందుకే వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఒక్కసారి హిట్ టాక్ వస్తే బాలయ్య సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తుంటాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన అఖండతో అద్భుత విజయం అందుకున్న బాలయ్య ఈ సారి కూడా అదే టైమ్ కు రాబోతున్నాడు.

యస్.. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోన్న బాలయ్య 107 మూవీని కూడా డిసెంబర్ లోనే క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.అఖండ విజయం తర్వాత బాలయ్య.. క్రాక్ బ్లాక్ బస్టర్ ఊపులో ఉన్న గోపీచంద్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకుంటారు అనేలానే ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ గా వస్తోన్న అప్డేట్స్ చెబుతున్నాయి. బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగానే గోపీచంద్ ఈ కథను రూపొందించుకున్నాడట. బాలయ్య క్యారెక్టరైజేషన్ విషయంలో మరీ ప్రయోగాలకు పోకుండా చూసుకుంటున్నాడట. ఆడియన్స్ ఆయన్నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో దాన్నే తనదైన శైలిలో ప్రెజెంట్ చేయబోతున్నాడంటున్నారు. మొత్తంగా అఖండ విజయం కోసం మళ్లీ డిసెంబర్ లోనే క్రిస్మస్ బరిలో దిగుతోన్న బాలయ్య.. ఈ సారి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Related Posts