ad

సీసాతో స్పైసీ మహరాజ్ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకూ రవితేజ చేయని సబ్జెక్ట్ గా ఈ కథను చెబుతున్నారు. రెవిన్యూ డిపార్ట్ మెంట్ లోని లోపాలను, అవినీతిని గురించి చర్చిస్తూనే.. ఆ డిపార్ట్ మెంట్ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు చేయొచ్చు అనే పాయింట్ చుట్టూ ఈ కథనం నడుస్తుందని చెబుతున్నారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. రెండు నెలల క్రితమే విడుదల అనే హడావిడీ కూడా నడిచింది. కానీ ఫైనల్ గా జూలై 29న విడుదల కాబోతోన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఓ ఐటమ్ సాంగ్ విడుదల చేశారు. భారీ అందాల భామ అన్వేషీ జైన్ ఈ పాటలో నర్తించి తన సోయగాలతో నషాళానికెక్కించింది.

“నా పేరు సీసా.. ఒకరికి తేనే సీసా, ఒకరికి నే కల్లు సీసా, ఒకరికి నే మసాల సీసా, ఇంకొకిరికి రసాల సీసా.. అందరికీ అందిస్తాను.. స్వర్గానికి వీసా” అంటూ సాగే ఈ గీతాన్ని చంద్రబోస్ రాశాడు. శామ్ సిఎస్ సంగీతం అందించగా శ్రేయా ఘోషల్ ఆలపించింది. ఈ పాటలో రవితేజ కూడా కనిపిస్తున్నాడు. ఐటమ్ సాంగే అయినా అన్వేషీ జైన్ ఇప్పటికే హాట్ హాట్ వెబ్ సిరీస్ లతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. మొదట్లో హీరోయిన్ గా చేసినా వర్కవుట్ కాకపోవడంతో అమ్మడు ఇలా సి గ్రేడ్ సిరీస్ లకు పరిమితమైంది. అంటే అన్వేషీకి తెలుగు ఆడియన్సెస్ లోనూ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఈ సినిమాకు బాగానే హెల్ప్ అయ్యేలా ఉంది. పాటను చంద్రబోస్ రాయడం వల్లేమో పరిధి దాటిన పదాలేవీ కనిపించలేదు. అన్నట్టు నా పేరు సీసా అంటుందేంటీ పిల్ల అనే డౌట్ వస్తుంది కదా.. సీసా అంటే సీకాకుళం సారంగి అట. మరి ఈ సీసా కలెక్షన్లకు ఎంత మత్తును ఎక్కిస్తుందో చూడాలి.

, , , , , , , ,