సినిమా లేట్ అయినా.. ట్రైలర్ ముందే ఇచ్చేస్తున్నారు..

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా ఈ ఏడాదే వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ మేజర్. అందులో హీరోగా నటిస్తున్న అడవి శేష్ కి హిందీలో పాపులారిటీ లేకపోయినా, ఈ సినిమా ముంబయి ఉగ్రవాదుల నేపథ్యంలో తెరకెక్కడం వల్ల హిందీలోనూ బజ్ ఏర్పడింది. జూన్ 3న రాబోతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఫస్ట్ మేజర్ ధియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి డేట్ లాక్ చేశారు.
టాలీవుడ్లో ఇప్పుడు ఎవరిని కదిపినా పాన్ ఇండియా అనే మాటే వినిపిస్తోంది. మన పెద్ద హీరోల్లో కొంత మంది సౌత్ తో పాటు హిందీలోనూ సత్తా చాటుకున్నారు. మరి కొందరు అదే బాటలో వెళుతున్నారు. ఈ లిస్ట్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ కూడా చేరాడు. తన కొత్త సినిమా మేజర్ ని తెలుగు, హిందీ బాషల్లోనే రూపొందించారు మేకర్స్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర. ఇక సినిమా శశి కిరణ్ తిక్క దర్శకుడు.

మేజర్ సినిమా 2008లో ముంబయి మీద ఉగ్రవాదులు దాడులు చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఆ దాడుల్లో టెర్రరిస్టులను అంతమొందించి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో ఆడవి శేష్ నటించారు. తన ప్రేయసిగా సయీ మంజ్రేకర్ నటించింది. మరో కీలక పాత్రల్లో శోభిత ధూళిపాళ నటించింది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఇచ్చిన పాటల్లో రెండు పాటలు విడుదలయ్యాయి. అలాగే టీజర్ కూడా వచ్చి మేజర్ పై ఇంట్రెస్ట్ ని పెంచింది. మేజర్ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేస్తున్నాడు. కథ కారణంగా నార్త్ లోనూ ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. పైగా సోనీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రం రైట్స్ ని తీసుకుని రిలీజ్ చేస్తోంది. రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతోంది. అందులో భాగంగా ఈ నెల 9న మేజర్ ధియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. తెలుగు, హిందీలో తెరకెక్కిన మేజర్… డబ్బింగ్ వెర్షన్స్ లో తమిళ, మలయాళ బాషల్లోనూ రాబోతుంది.

Telugu 70mm

Recent Posts

The director’s attempt to get back into form.

Before 'Acharya', Koratala Siva was in the list of directors who did not succeed in…

15 mins ago

తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు దర్శకుల ప్రయత్నం

‘ఆచార్య‘ ముందు వరకూ తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ. అయితే.. మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య‘ కొరటాల…

15 hours ago

Chiranjeevi’s wish to award NTR with Bharat Ratna

The Bharat Ratna Award is India's highest civilian award. Bharat Ratna is awarded to those…

17 hours ago

ఎన్టీఆర్ కి భారతరత్న రావాలని ఆకాంక్షించిన చిరంజీవి

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన…

17 hours ago

Ram is getting ready with a crazy lineup

Energetic star Ram, who came before the audience with last year's movie 'Skanda', is going…

20 hours ago

Another female director of Telugu film industry

Lady directors are now on the rise in the Telugu film industry. Veteran actresses like…

20 hours ago