ప్రముఖ నిర్మాత ఎల్ వి ప్రసాద్ గారిని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ..

ప్రముఖ నిర్మాత దర్శకుడు నటుడు దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి గ్రహీత శ్రీ అక్కినేని లక్ష్మీ వర ప్రసాదరావు ( ఎల్ వి ప్రసాద్ ) గారిని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ….

ఈయన జనవరి 17, 1908లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామంనందు అక్కినేని శ్రీరాములు బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించారు.హిందీ తమిళ తెలుగు కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ నిర్మించటంగానీ నటించటంగానీ చేసారు.అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ తమిళ తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా కాళిదాసు మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించారు.తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటారు.

రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగారు.
చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవారు.స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవారు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.17 యేళ్ళ వయసులో 1924లో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా ఫక్కీలో పెళ్ళి చేసుకున్నారు.వెనువెంటనే వీరికి ఒక ఆడపిల్ల పుట్టుంది. ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక ఇళ్ళు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకునేట్టు చేశారు.ఇదే సమయంలో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికై ఉపయోగించాలని నిశ్చయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళారు.ప్రసాద్ బొంబాయి (ముంబై) చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా పనిచేశారు.

అచట ఇండియా పిక్చర్స్ అక్తర్ నవాజ్ తను నిర్మిస్తున్ననిశ్శబ్ద చిత్రం ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్ చిన్న పాత్ర ఇచ్చారు.1931 లో అతను వీనస్ ఫిలిం కంపనీలో నియమితుడై భారతదేశం యొక్క మొదటి టాకీ ఆలం అరాలో నటించారు.తరువాత ఇతర చిన్న పాత్రలు అనుసరించాయి. ఇంపీరియల్ ఫిలింస్ సినిమాల ద్వారా ప్రసాద్ హ్ ఎన్ రెడ్డిని కలుసుకోవడం జరిగింది. రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ టాకీ కాళిదాస్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. తర్వాత తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదుడులో అవకాశమిచ్చారు. ఆ సమయములో ప్రసాద్ తన కుటుంబాన్ని సందర్శించడానికి ఇంటికి తిరిగి వచ్చారు.
అతని భార్య కుమార్తెతో బొంబాయి తిరిగి వచ్చారు.
అచట అతని కుమారులు ఆనంద్ రమేష్ జన్మించారు.

అనుకోని ఒక అవకాశం ద్వారా ప్రసాద్ కు ఆలీ షా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని దొరికింది. తన పేరు ఉపయోగించడానికి చాలా పొడవుగా ఉందన్న ఒక గుమస్తా కారణముగా అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ రావు పేరు ఎల్వి ప్రసాద్ గా కుదించబడింది .తంత్ర సుబ్రహ్మణ్యం తన కష్ట జీవి చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఈ చిత్రం మూడు రీల్స్ షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ప్రసాద్ కి మరి కొన్ని ఇతర చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. పృథ్వీరాజ్ కపూర్ తో పరిచయం ద్వారా ఈ సమయంలో అతను పృథ్వీ థియేటర్స్ లో చేరారు . దీనివల్ల అతని నటనలోని అభిరుచి సంతృప్తి చెందింది. ఈ సమయంలోనే ప్రసాద్ తన మొదటి మొదటి హిందీ సినిమా ‘శారద’ హీరో రాజ్ కపూర్ని కలుసుకున్నారు .

1943 లో అతను గృహ ప్రవేశం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ బాధ్యతను నిర్వహించే అవకాశం వచ్చింది. పరిస్థితుల కారణంగా ఆ సినిమాకు దర్శకుడు అయ్యారు.అతను చిత్రం యొక్క ప్రధాన నటుడిగా ఎంపికయ్యారు.
1946 లో విడుదలైన గృహ ప్రవేశం నలభై లలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. ఆ చిత్రం ఒక క్లాసిక్ గా ఎదిగింది. ఈ చిత్రం తరువాత కే.స్. ప్రకాశ రావు ప్రసాద్ కి ద్రోహి లో ఒక ముఖ్యమైన పాత్రను అందించారు.

ఈసమయంలో రామబ్రహ్మం గారి అనారోగ్యం కారణంగా తన చిత్రం పల్నాటియుద్ధం ఇబ్బందిలో పడింది.వారు తన చిత్రానికి న్యాయం చేయాలని ఎంచుకోవటం జరిగింది. 1949లో మనదేశం చిత్రం తన దర్శకత్వంలో శ్రీ ఎన్ టి రామారావు గారిని పరిచయం చేయటం జరిగింది. 1950 లో విజయ సంస్థ వారు ప్రసాద్ గారిని దర్శకుడుగా ఎన్నుకోవటం జరిగింది.వారి దర్శకత్వంలో నిర్మించిన షావుకారు చిత్రం రామారావు నాయకుడిగా, సంసారం చిత్రం రామారావు నాగేశ్వరరావు నాయక పాత్రధారులుగా, ఇదంతా ఒక ఇతిహాసం.

నిర్మాతగా తన తొలి చిత్రం 1955 లో విడుదలయిన ఇలవేలుపు.తరువాత ముంబై వెళ్లి ఖిలోన ససురాల్ మిలన్ ఏక్ దూజే కె లియే లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 1974 లో చెన్నై లో ప్రసాద్ ఫిలిం లాబ్స్, హైదరాబాద్ లో ఐ ఇన్స్టిట్యూట్,. స్థాపించటం జరిగింది.ప్రసాద్ గారు 1994 జూన్ 22 న మరణించారు.వారి స్మారకార్థం భారత తపాలా శాఖ వారు 2006 సెప్టెంబర్ 5 న ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయడం జరిగింది.

Telugu 70mm

Recent Posts

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

46 mins ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

1 hour ago

Only one song for the entire movie ‘Kalki’?

Among the crazy movies coming this year at pan India level is 'Kalki 2898 AD'.…

1 hour ago

‘Devara’ songs update from Ramajogayya Sastry

Not only the first song from 'Devara'.. the second song is also coming as a…

1 hour ago

Another aspect of TV actor Chandu’s life

Television actor Chandu's suicide has created a sensation. Serial actress Pavitra died in a car…

1 hour ago

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

3 hours ago