ప్రముఖ నిర్మాత ఎల్ వి ప్రసాద్ గారిని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ..

ప్రముఖ నిర్మాత దర్శకుడు నటుడు దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి గ్రహీత శ్రీ అక్కినేని లక్ష్మీ వర ప్రసాదరావు ( ఎల్ వి ప్రసాద్ ) గారిని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ….

ఈయన జనవరి 17, 1908లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామంనందు అక్కినేని శ్రీరాములు బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించారు.హిందీ తమిళ తెలుగు కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ నిర్మించటంగానీ నటించటంగానీ చేసారు.అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ తమిళ తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా కాళిదాసు మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించారు.తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటారు.

రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగారు.
చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవారు.స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవారు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.17 యేళ్ళ వయసులో 1924లో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా ఫక్కీలో పెళ్ళి చేసుకు�