‘లాల్ సలామ్’ ట్విట్టర్ రివ్యూ

నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య కపిల్ దేవ్ తదితరులు
సినిమాటోగ్రఫి: విష్ణు రంగసామి
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నిర్మాత: సుబస్కరన్ (లైకా ప్రొడక్షన్స్)
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్
విడుదల తేదీ: 09-02-2024

ఒకప్పుడు వరుసగా అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈకోవలోనే.. తన కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్ లోనూ నటించడానికి సై అన్నాడు. ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్‘ పొంగల్ స్పెషల్ గా రిలీజవ్వాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 9న) వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది. రజనీకాంత్ ఎక్స్ టెండెడ్ కేమియోలో నటించిన ‘లాల్ సలామ్’ ఎలా ఉంది? సూపర్ స్టార్ ఫ్యాన్స్ మెప్పిస్తోందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మతాలు, కులాల మధ్య చిచ్చులు పెడుతుంటారు. దీని వ‌ల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? అనే నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించింది డైరెక్టర్ ఐశ్వర్య. ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్‌ గా రజనీకాంత్ నటించాడు. ఇతర ప్రధాన పాత్రల్లో యువ కథానాయకులు విష్ణు విశాల్‌, విక్రాంత్ కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చడం విశేషం.

సినిమా మొత్తానికి సెకండాఫ్ అదిరిపోయిందని.. ద్వితీయ భాగం ‘లాల్ సలామ్’ని మరో లెవెల్ కి తీసుకెళ్లిందనే రివ్యూస్ వస్తున్నాయి. సెకండాఫ్ లో మొత్తం రజనీకాంత్ షో లా సాగిందని.. ముస్లిమ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ మూవీ అంకితం అంటూ ఫ్యాన్స్ ‘లాల్ సలామ్’ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సెకండాఫ్ లో ముస్లిమ్ గెటప్ లో రజనీకాంత్ అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అదిరిపోయిందని ట్విట్టర్ లో రివ్యూస్ వస్తున్నాయి.

మానవత్వం మతాలను మించిందని.. అదే ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రంలో చూపించిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుందని.. దర్శకురాలు ఐశ్వర్య ను అందుకు ప్రశంసించాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్ గా సినిమాలో 53 నిమిషాల పాటు మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తాడనేది అభిమానులు చెబుతున్న మాట. దీనిలో మొదటి అర్థ భాగంలో 15 నిమిషాల పాటు రజనీకాంత్ కనిపిస్తాడట.

రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ నటన ప్రధానంగా ఆకట్టుకుంటుందట. తంబి రామయ్య, జీవిత, కపిల్ దేవ్ పాత్రలు కూడా గుర్తుండిపోయేలా ఉన్నాయనే రివ్యూస్ వస్తున్నాయి. టెక్నికల్ గా ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ‘లాల్ సలామ్’ని మరో లెవెల్ లో నిలబెట్టిందంటున్నారు. మొత్తానికి.. ఐశ్వర్య రజనీకాంత్ కి దర్శకురాలిగా ‘లాల్ సలామ్’తో ఫస్ట్ హిట్ దక్కిందంటున్నారు.

Related Posts