ఆ అమ్మాయి గురించి చెప్పేందుకు ఓ అందమైన పాట వచ్చింది..

అందరు దర్శకులకు ఓ టేస్ట్ ఉంటుంది. కొందరు దర్శకుల టేస్ట్ యూనిక్ గా ఉంటుంది. అలాంటి వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అతన్ని సినిమాల్లో ఓ పొయొటిక్ సెన్స్ కనిపిస్తుంది. అప్పుడప్పుడూ తేడా కొట్టినా ఎక్కువ శాతం ఆకట్టుకుంటాయి. ఆ స్టైల్ వల్లే మోహనకృష్ణ దర్శకత్వానికి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. డిఫరెంట్ జానర్స్ చేసినా.. తనదైన సెన్సిబిలిటీస్ ని వదలని దర్శకత్వం అతని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే మరోసారి హైలెట్ అవుతుందేమో అనిపించేలా ఇప్పుడు ” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాతో వస్తున్నాడు. సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తోన్న సినిమా ఇది. మహేంద్ర బాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ అందమైన వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
కథ నచ్చితే తప్ప సంగీతానికి కమిట్ కాని వారిలో తెలుగు నుంచి ముందు వరుసలో ఉండే వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజీషియన్. వివేక్ సంగీతం అంటే మంచి కథ కూడా ఉంటుందని అర్థం. అది ఈ పాటతో మరోసారి ప్రూవ్ అయింది. వినసొంపైన స్వరానికి అందమైన సాహిత్యం తోడై ఓ హాంటింగ్ మెలోడీలా వినిపిస్తోందీ గీతం. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను చైత్ర అంబడిపూడి, అభయ్ జోధ్ పుర్కర్ ఆలపించారు.

“ఓ అల్లంత దూరంగ నువ్వూ నీ కన్నూ నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో.. హా.. రవంత గారంగా నాలోని నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో” అంటూ మంచి సాహిత్యం కూడా ఉన్న ఈ పాట వినగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య వస్తోన్న లిరికల్ సాంగ్స్ లా కాకుండా పూర్తి వీడియో సాంగ్ కూడా కావడంతో మరింత అందంగా అనిపిస్తుంది. పూర్తి మాంటేజ్ సాంగ్ లా కనిపిస్తోన్న ఈ గీతం హీరో హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడే చిగురిస్తోన్న ప్రేమను ఎలివేట్ చేస్తోంది.
ఇక ఇంతకు ముందు సుధీర్ బాబు, మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం సినిమా వచ్చింది. కాస్త ఆ ఫ్లేవర్ కూడా ఇందులో కనిపిస్తోందనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. సమ్మోహనంలో సుధీర్ పాత్రకు సినిమాలంటే ఇష్టం ఉండదు. హీరోయిన్ సినిమా నటి. ఇందులో సుధీర్ సినిమా దర్శకుడుగా నటిస్తున్నాడు. మరి ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో కానీ.. ఆ అమ్మాయిగురించి చెప్పిన ఈ పాట మాత్రం చాలా బావుంది.

Related Posts