తమన్నాను ఐటమ్ సాంగ్ కే పరిమితం చేశారా..?

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ లీగ్ లో ఉన్నా.. కొత్తగా వచ్చిన భామల మధ్య నుంచి తప్పుకోక తప్పలేదు తమన్నాకు. సీనియర్ హీరోయిన్ గా తనకు తగ్గ పాత్రలు చేస్తూ ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటోంది. నటిగా ఎప్పుడో నిరూపించుకున్న తను ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ కోసం కాక.. కేవలం తనకు పని వస్తే చాలు అన్నట్టుగా ఉంది. అందుకే కొత్త పాత హీరోలందరితో నటించేందుకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలతో పాటు రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోన్న తమ్మూ తెలుగులో నటించిన గుర్తుందా శీతాకాలం రిలీజ్ కు రెడీగా ఉంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. సెప్టెంబర్ లో మళ్లీ రిలీజ్ డేట్ వేశారు. అప్పుడైనా వస్తుందా లేదా అనేది చూడాలి. అయితే రీసెంట్ గా తమన్నా గురించి ఓ హాట్ న్యూస్ హల్చల్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా “జైలర్”లో తనే హీరోయిన్ అని.
జైలర్ లో హీరోయిన్ గా ముందు ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారు. తను తప్పుకుంది. దీంతో తమన్నాను తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. బట్ అవేవీ నిజం కాదట. అలాగని తమన్నా ఈ సినిమాలో లేదు అని కూడా కాదు. తను హీరోయిన్ కాదు అంతే. ఓ చిన్న కేమియో రోల్ ఉంటుందట. అలాగే ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పాడు అనే వార్తలు లేటెస్ట్ గా కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. నిజానికి తమన్నాకు రజినీకాంత్ తో నటించే ఛాన్స్ వస్తే వదులుకునేది కాదు. అయినా దర్శకుడు ఆమెను ఆ పాత్రకు తీసుకోలేదంటే కారణం.. మరో బాలీవుడ్ భామ కోసం చూస్తున్నారట.
ఐశ్వర్య తప్పుకుంది కాబట్టి ఆ పాత్రకు ఖచ్చితంగా బాలీవుడ్ బ్యూటీనే తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారంటున్నారు. ఇప్పటి వరకూ వినిపిస్తోన్న దాన్ని రజినీతో గతంలో కాలా సినిమాలో నటించిన హుమా ఖురేషీ కోసం ట్రై చేస్తున్నారని టాక్. మరి ఈ హీరోయిన్ మేటర్ లో నిజమెంతో కానీ.. తమన్నాను మాత్రం మరోసారి ఐటమ్ సాంగ్ కే పరిమితం చేశారని తేలిపోయింది.