జనసేనకు రూ.5 కోట్లు విరాళం అందించిన చిరంజీవి

జనసేనకు విజయోస్తు.. విజయీభవ అని పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి.. తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాతాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు.

జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు శ్రీ నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి అందించారు మెగాస్టార్.

హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్.. ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయ్యింది సోమవారం ఉదయం 10 గంటలకు ‘విశ్వంభర’ లొకేషన్ కు చేరుకున్న పవన్, నాగబాబు లకు ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు చిరంజీవి. మెగాస్టార్ ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. అన్నయ్య చిరంజీవి పాదాలకు నమస్కరించారు.

ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టి.వి.లో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి.. తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతోపాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయల చెక్కును చిరంజీవి సిద్ధం చేసి.. మరునాడే అందజేశారు.

Related Posts