‘పుష్ప 2‘ ఆగమనానికి 200 రోజులు

‘బాహుబలి 2, కె.జి.యఫ్ 2‘ తర్వాత రెండు పార్టులుగా యావత్ దేశ సినీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోన్న చిత్రం ‘పుష్ప 2‘. అంతకు ముందు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన క్రెడిట్ ‘పుష్ప‘ చిత్రానికే దక్కుతోంది. ‘ఆర్య, ఆర్య2‘ వంటి చిత్రాల తర్వాత.. బన్నీ-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప‘ ఫస్ట్ పార్ట్ ‘ది రైజ్‘ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో తగ్గేదే లే అంటూ కలెక్షన్ల సునామీ సృష్టించాడు ‘పుష్ప‘రాజ్.

‘పుష్ప1‘ భారీ విజయం తర్వాత సెకండ్ పార్ట్ ‘పుష్ప: ది రూల్‘పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ‘పుష్ప 2‘ ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. అంటే.. ఈరోజుకు సరిగ్గా విడుదల తేదీ 200 రోజులుందన్నమాట. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ఫ్యాన్స్ కోసం ‘ది రూల్ బిగిన్స్ ఇన్ 200 డేస్‘ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో కొండపైకి వెళుతోన్న ఓ టైగర్ ఫోటో కూడా ఆసక్తిని కలిగిస్తోంది.

Related Posts