అదరగొడుతోన్న కమల్ హాసన్ విక్రమ్

ఈ మధ్య కొన్ని సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించినా యాభై రోజుల పోస్టర్ చూడటం అసాధ్యంగా మారింది. కానీ ఓ డబ్బింగ్ సినిమా పోస్టర్ పై ఆ ప్రింట్ పడేలా ఉంది. అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఆ సినిమా విక్రమ్. కమల్ హాసన్ కు చాలా రోజుల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఇది. తెలుగు కంటే తమిళ్ లో ఇంకా అదరగొడుతోన్న ఈ మూవీ ఓ రేర్ రికార్డ్ ను కూడా క్రియేట్ చేసింది. కమల్ మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఈ రికార్డ్ మరోసారి ప్రూవ్ చేస్తోంది.లోక నాయకుడుగా వాల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న ఇండియన్ స్టార్ గా కమల్ హాసన్ పేరు ముందుంటుంది. ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో మేకప్పులు వేసిన కమల్ కు తెలుగులోనూ వీరాభిమానులున్నారు. బట్ కొన్నాళ్లుగా కమల్ హాసన్ నుంచి మంచి సినిమాలు రావడం లేదు. వచ్చినవేవీ పెద్ద విజయాలుగా నిలవడం లేదు. ఈ టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడు. పైగా సొంత బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. ముంందు నుంచీ కమల్ ఈ మూవీపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అందరూ అలాగే ఉంటారు కదా అని చాలామంది లైట్ తీసుకున్నారు. బట్ బొమ్మ పడిన తర్వాతే తెలిసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు కమల్ కాన్ఫిడెన్స్ వెనక కారణం ఏంటో.విక్రమ్ మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. పైగా చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ ఊరమాస్ మూవీ చేయడం కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. బలమైన కథ, కథనాలు కూడా విక్రమ్ విజయానికి పునాది వేశాయి. ఇప్పటికే ఓవర్శీస్ లో తమిళ్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన విక్రమ్.. ఇండియాలో కూడా ఏకంగా 400కోట్లు కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది. విశేషం ఏంటంటే.. విక్రమ్ కు హిందీ నుంచి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. అయినా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అత్యంత అరుదైన విషయమే. మొత్తంగా కమల్ తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి వారితో పాటు చివర్లో రోలెక్స్ గా వచ్చిన సూర్య పాత్ర సైతం విక్రమ్ విజయంలో కీలక పాత్ర పోషించి ఈ రికార్డ్ కలెక్షన్స్ కు కారణమయ్యాయి. ఇక తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన డబ్బింగ్ సినిమాలతో పోలిస్తే విక్రమ్ కొన్నవారికి భారీ లాభాలే తచ్చింది.

Related Posts