ad

పుష్పా 2021 డిసెంబర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. అల్లు అర్జున్ లుక్ అండ్ యాక్టింగ్ కు కంట్రీ మొత్తం ఫిదా అయింది. ఆ మాటకొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా తగ్గేదే లే అంటూ ఆ మేనరిజమ్స్ ను చాలామంది బిగ్ సెలబ్రిటీస్ కూడా పబ్లిక్ గా చేశారు.. చేస్తున్నారు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ కు సీక్వెల్ మాత్రం అంత గొప్పగా సాగడం లేదు. చాలాకాలంగా సీక్వెల్ కు సంబంధించిన కహానీలు వినిపిస్తున్నాయే కానీ.. కథ మాత్రం కుదరలేదట. ఇంతకీ అసలు పుష్ప 2 ఉందా లేదా..?గంధపు చెక్కల స్మగ్లర్.. అనే కోణం వెండితెరపై ఎప్పుడూ విలన్ కే పరిమితం అయింది. కానీ స్టార్ హీరోను ఆ ప్లేస్ లో పెట్టి స్మగ్లర్ గా చూపించి.. బ్లాక్ బస్టర్ అందుకోవడం అంటే చిన్నవిషయం కాదు. ఇది పూర్తిగా సుకుమార్ కే ఇవ్వాల్సిన క్రెడిట్. తను ఎంచుకున్న కథ నెగెటివ్ దే అయినా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవడం డైరెక్టర్ క్రెడిటే. దానికి అల్లు అర్జున్ పెట్టిన ఎఫర్ట్, తన పాత్ర కోసం చేసిన కృషి గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టైలిష్‌ స్టార్ అన్న తన ట్యాగ్ కు పూర్తి భిన్నంగా డీ గ్లామర్ రోల్ లో చాలామంది డ్రీమ్ రోల్ అనిపించేలా నటించాడు. అటు శ్రీవల్లిగా రష్మిక నటన, గ్లామర్ తో పాటు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ గా నిలిచి పుష్పను బ్లాక్ బస్టర్ ను చేశాయి.పుష్పలో బలమైన విలన్ లేడనే చెప్పాలి. పుష్పరాజ్ ప్రతి నిర్ణయమూ అతనికి అనుకూలంగానే ఉంటుంది.

అజయ్ ఘోష్‌, సునిల్, ధనుంజయ వంటి వారు ఉన్నా.. చివర్లో వచ్చిన షెకావత్ పాత్రే అతనికి పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసింది. ఫహాద్ ఫాజిల్ చేసిన ఆ రోల్ సెకండ్ హాఫ్‌ లో కీలకం కాబోతోంది. అయితే మొదటి భాగాన్ని సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసినా.. రెండో భాగానికి సరిపోయే కథ ఇంకా సెట్ కాలేదు. సీక్వెల్ కు లీడ్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ ను ఫినిష్‌ చేసినా.. పుష్ప రూల్ చేసేంత స్టఫ్ ఇంకా కథలో సెట్ కాలేదని టాక్. దీనికోసం సుకుమార్ విదేశాలకు వెళ్లి కథకోసం కసరత్తులు చేశాడు. హైదరాబాద్ లోనూ చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకూ బలమైన కథ మాత్రం కుదరలేదనే చెబుతున్నారు.ఒక బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ తీయడం అంత సులువు కాదు. అంచనాలు భారీగా ఉంటాయి. ముందే రెండు భాగాలు అనుకుని రంగంలోకి దిగితే అది కెజీఎఫ్‌ లా ఉంటుంది. కానీ పుష్ప కెజీఎఫ్‌ ను చూసిన తర్వాత రెండో భాగం చేయాలి అనుకున్న సినిమా. అందుకే ఈ పార్ట్ కు సంబంధించి క్రియేటివ్ డైరెక్టర్ కు ఇంకా క్లారిటీ రాలేదు అంటున్నారు. ఏదేమైన అల్లు అర్జున్ కు కూడా కథ పూర్తిగా నచ్చేవరకూ స్టోరీ సిట్టింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా కథ ఓకే అయింది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఓకే అయితే ఇంకా షూటింగ్ కు రెడీ అనుకోవడానికీ లేదు. ఎందుకంటే ఇది వానాకాలం. సో.. పుష్ప2 సెట్స్ పైకి వెళ్లడానికి కథ రెడీ అయినా ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే అన్నమాట.

, , , , , , , ,