కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ మెంట్ తోనే ఆకట్టుకుంటాయి. ఒక గ్రేట్ టైమింగ్ ఉన్న రైటర్ కు అంతకంటే బెటర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ దొరికితే ఆ కాంబినేషన్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఎంటర్టైన్మెంట్ పక్కా అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు. అలాంటి ప్రీ ఫిక్సింగ్ కాంబినేషనే ఇది. మాస్ మహరాజ్ రవితేజ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రెండో సినిమాతోనే ఎంటైర్ టాలీవుడ్ అండ్ ఆడియన్స్ కు మోస్ట్ ఫేవరెట్ అయిన దర్శకుడు అనుదీప్ కేవి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్ధం అవుతుంది.
అనుదీప్ ఫస్ట్ మూవీగా ఓపిట్టగోడ తీశాడు. బట్ ఆ చిత్రం గురించి ఎవరికీ తెలియదు. తర్వాత వచ్చిన జాతిరత్నాలు కోవిడ్ టైమ్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
కథంటూఏం లేకుండా కొన్ని సన్నివేశాల సమహారంగాలాగా ఓ కొత్త ప్రయోగంలా తీసిన ఈ చిత్రం అందరు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో కాసుల వర్షం కురిసింది. ఈ క్రేజ్ తో తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ మాత్రం ఆకట్టుకోలేదు.
బట్ అనుదీప్ సినిమా దర్శకుడుగా కంటే ఇంటర్వ్యూస్ తో టివి షోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు అనేది నిజం.
ఇక ఇప్పుడు రవితేజ వరుస సినిమాలతో ఓ రేంజ్ దూకుడు చూపిస్తున్నాడు. రిజల్ట్ తో పనిలేకుండా రెమ్యూనరేషన్ కూడా పెంచుతున్నాడు. అయినా నిర్మాతలు అతన్ని వదలడం లేదు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసింది నిర్మాత దిల్ రాజు కావడం విశేషం. దిల్ రాజు బ్యానర లో అంటే మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
రవితేజ సరసన హీరోయిన్ గా త్రిష లేదా తమన్నాను తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారట.ఏదేమైనా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో క్రేజీయొస్ట్ కాంబినేషన్ అంటే ఇదే అని చెప్పొచ్చేమో..?