HomeLatestPrabhas : సలార్ డేట్ తో ఇచ్చిపడేసిండుగా

Prabhas : సలార్ డేట్ తో ఇచ్చిపడేసిండుగా

-

ప్రభాస్ సినిమా అంటే ఇండియా మొత్తం ఓ రేంజ్ లోక్రేజ్ ఉంటుది. అలాంటిది చెప్పిన టైమ్ కు సినిమా రావడం లేదు అంటే ఖచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు. పైగా ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసిన సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటే ఫ్యాన్స్ లోనూ ఓ రకమైన అసహనం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి అంటే కంటెంట్ కు సంబంధించి ఏదైనా లోపాలున్నాయా అనే డౌట్స్ అనేకమందిలో వస్తున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సలార్ మూవీపైనా ఇలాంటి వార్తలు వచ్చాయి.


సలార్ ను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నాం అని చాలా రోజుల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ ఆ డేట్ కు రావడం లేదు. సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఆ తర్వాత విడుదలయ్యే సినిమా నిర్మాతల మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ కే ద్వారా అశ్వనీదత్ లో టెన్షన్ మొదలైందన్నమాట.

ప్రాజెక్ట్ కే ను 2024 సంక్రాంతికి పలాన్ చేసుకున్నారు. సలార్ లేట్ అయితే ఆటో మేటిక్ గా ఇది ఆ డేట్ కు వెళుతుంది. ఇలాంటి ఒత్తిడి అని చెప్పలేం కానీ.. అసలు పోస్ట్ పోన్ ఆలోచనే లేని సినిమాకు రూమర్స్ వస్తే ఊరుకుంటారా..? అందుకే సలార్ మేకర్స్ ఈ మూవీ నుంచి ఓ అద్భుతమైన పోస్టర్ విడుదల చేస్తూ తమ సినిమా వాయిదా పడలేదు అని ఖచ్చితంగా మరోసారి సెప్టెంబర్ 28 రిలీజ్ అని చెప్పేశారు

. సో.. జూన్ 16న ఆదిపురుష్‌ ఆ తర్వాత సెప్టెంబర్ 28న సలార్ తో పాటు వచ్చే సంక్రాంతికి ప్రాజెక్ట్ కే వస్తాయి. వీటిలో ఏ తేడాలు ఉండవు. అంచేత.. ఇక ఇలాంటి రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు.

ఇవీ చదవండి

English News