రవితేజా మరీ అంత దిగజారాలా..?

మాస్ మహరాజ్ గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవితేజ విషయంలో కొన్నాళ్లుగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అవి నిజమా కాదా అనేది అతని గత చిత్రాల సక్సెస్ ను చూస్తే తెలుస్తుంది. నిజానికి రవితేజ కెరీర్ లో సక్సెస్ రేట్ చాలా అంటే చాలా వరకూ పడిపోయి చాలాకాలమే అయింది. చిరంజీవి, శ్రీకాంత్ తర్వాత స్వయంకృషితో ఎదిగాడు అనే ట్యాగ్ కూడా ఉంటుంది రవితేజకు. అయితే అతని మీద వస్తోన్న కంప్లైంట్స్ ఏంటంటే.. రవితేజ కథలు వినడు. కేవలం ఎక్కువ రెమ్యూనరేషన్.. తక్కువ వర్కింగ్ డేస్ ఉంటే చాలు.. వెంటనే ఓకే చెబుతాడు. కథల విషయంలో మరీ పక్కాగా ఉండడు అనేది ఇండస్ట్రీ అంతా చెప్పుకునే మాట. అంటే సరైన కథలు ఎంచుకోలేకపోవడం అనేది అతని మిస్టేక్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. సినిమా అనేది హీరో సెంట్రిక్ గాజరిగే వ్యాపారం. అంటే అతనికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలో ఒక్కోసారి ఫెయిల్ అవ్వొచ్చు. కానీ ఆ ఫెయిల్యూర్ ను దర్శకుడి మీదికి నెట్టేయడం.. లేదంటే తమకేం సంబంధం లేదన్నట్టుగా.. చీప్ గా మాట్లాడ్డం సరైంది కాదు. ఈ విషయంలోనే రవితేజ కాస్త దిగజారి మాట్లాడాడు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తోన్న విమర్శ.


రీసెంట్ గా రవితేజ బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ఆహా షో అన్ స్టాపబుల్ కు గెస్ట్ గా వెళ్లాడు. చాలా మాట్లాడుకున్నారు. చెప్పారు. అయితే రవితేజ డిజాస్టర్ మూవీస్ గురించి చెప్పమంటే అతను ‘అమర్ అక్బర్ ఆంటోనీ’గురించి చెప్పాడు. చెబితే పోయేది. ఆ సినిమా గురించి మరీ తక్కువ చేసి రాడ్ మూవీనా అని బాలయ్య అడిగితే అబ్బో రాడ్ రంబోలా అని చెప్పడం.. మీరు చూశారా..? చూడకపోవడమే మంచిదిలెండి.. అంటూ చెప్పడం బాలేదనేది మెజారిటీ సినిమా జనాల అభిప్రాయం. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్లను అవమానించినట్టే కదా.. ఎవరూ ఫ్లాప్ మూవీ తీయాలని ప్లాన్ చేసుకుని బరిలోకి దిగరు కదా..? ఏదో ఈ సినిమా బాగా ఆడుతుందనుకున్నాం.. బట్ ఆడియన్సెస్ కు నచ్చలేదు అనేస్తే పోయేదానికి మరీ దర్శకుడిని ఇన్ డైరెక్ట్ గా ఇంత తక్కువ చేసి మాట్లాడాలా.. అనేది చాలామంది అంటోన్న మాట.
ఇదే రాడ్ అంటే ఇంతకు మించిన రాడ్లు రవితేజ కెరీర్ లో చాలానే ఉన్నాయి. అవన్నీ వదిలేసి.. కేవలం శ్రీను వైట్ల సినిమా గురించే చెప్పడం దారుణమే కదా.. ఏదేమైనా కథల విషయం పట్టించుకోకుండా కేవలం రెమ్యూనరేషన్ వర్కింగ్ డేస్ కే ప్రాధాన్యం ఇచ్చే హీరోలకు ఇలాంటి రాడ్ లో కమెంట్స్ చేసే రైట్ ఉండదేమో..?

Related Posts