జెంటిల్మన్ -2కి ఇది పెద్ద వి(జ)షయమే మరి

జెంటిల్మన్.. 1993లో వచ్చిన సంచలన చిత్రం. ఈ మూవీతోనే శంకర్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఓ సామాజిక సమస్యను కమర్షియల్ గా చెప్ని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. జెంటిల్మన్ తో ఓవర్ నైట్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు శంకర్. ఇక ఈ చిత్రాన్ని నిర్మించింది కెటి కుంజుమోన్. ఆయన అప్పటికే తమిళ్ లో చాలా సినిమాలు నిర్మించినా ఈ జెంటిల్మన్ తర్వాత సౌత్ మొత్తం ఫేమ్ అయ్యాడు. పైగా కుంజుమోన్ అంటే ముందు నుంచీ అత్యంత భారీ చిత్రాలకు పెట్టింది పేరు. జెంటిల్మన్ తో పాటు ప్రేమికుడు, ప్రేమదేశం వంటి బిగ్ బడ్జెట్ మూవీస్ ను నిర్మించి అదే స్థాయిలో విజయాలనూ అందుకున్న నిర్మాత ఆయన. అయితే అదే బిగ్ బడ్జెట్ క్రేజ్ ఆయన నిర్మాణ సంస్థను నిండా ముంచింది. నాగార్జునతో నిర్మించిన రక్షకుడు చిత్రం ఆ టైమ్ కు ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పుడే మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న సుస్మితా సేన్ హీరోయిన్ గా ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ లాస్ ల తర్వాత మరో రెండు సినిమాలు నిర్మించినా అవేవీ విజయం సాధించలేదు. దీంతో 1999లోనే నిర్మాణానికి స్వస్తి చెప్పారు కుంజుమోన్.
మళ్లీ ఇన్నాళ్లకు జెంటిల్మన్ 2 చిత్రాన్ని రూపొందిస్తున్నానంటూ ఆ మధ్య అనౌన్స్ చేశారు. ఈ సారి తనే దర్శకత్వం చేస్తానని చెప్పాడు. అయితే లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ కు ఓ బిగ్ ఎసెట్ యాడ్ అయింది. అదే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఇండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడుగా వెలుగుతోన్న కీరవాణి జెంటిల్మన్ 2 చిత్రానికి సంగీతం ఇవ్వబోతున్నాడన్న విషయాన్ని కుంజుమోన్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించాడు. ఓ రకంగా కుంజుమోన్ అంటే ఈ తరానికి పెద్దగా తెలియదు. అయినా ఈ తరాన్ని మెప్పించే ప్రయత్నంలో ఉన్న ఆయనకు కీరవాణి సపోర్ట్ దొరకడం పెద్ద విజయంగానే చెప్పాలి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్స్ ఎవరనేది త్వరలోనే చెప్పబోతున్నారు. ఏదేమైనా జెంటిల్మన్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. మళ్లీ ఆ మ్యాజిక్ ను ఇప్పుడు రిపీట్ చేయడం అంత సులభం కాదు. అయినా కుంజుమోన్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Related Posts