మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్లవుతోన్నా ఇంకా ఫుల్ బిజీగానే ఉంది. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. కాకపోతే ఇంతకు ముందులా టాప్ స్టార్స్ సరసన ఆఫర్స్ లేవు. అయినా తను మాత్రం ఖాళీగా లేదు. తమ్మూ నటించిన గుర్తుందా శీతాకాలం విడుదలకు రెడీ అవుతోంది. సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా ఇది. అటు ఎఫ్ 3 కూడా చివరి దశలో ఉంది. అలాగే హిందీలోనూ రెండు సినిమాలు చేసింది. వీటిలో ఒకటి పూర్తయింది కూడా. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళా శంకర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ఓటిటి వెబ్ సిరీస్ లలో కూడా యాక్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది తమన్నా. అయితే కొన్నాళ్ల క్రితం తను హీరో్యిన్ గా మంచి టాప్ లో ఉండగానే అల్లుడుశీను సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది.
అదే తనకు ఫస్ట్ ఐటమ్ సాంగ్. తర్వాత కూడా బెల్లంకొండ శ్రీను సినిమా స్పీడున్నోడులో ఆడి పాడింది. అటుపై కెజీఎఫ్, జాగ్వార్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసినా.. జై లవకుశలో ఎన్టీఆర్ తో చేసిన స్వింగు జరా మాత్రం ఊపేసింది. అంటే తనిప్పుడు ఏ ఆఫర్ వచ్చినా చేయడానికి రెడీగా ఉందన్నమాట. అందుకే అమ్మడి ఆటపాటలను క్యాష్ చేసుకునేందుకు గని కూడా రెడీ అయ్యాడు.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా గని. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అతను బాక్సర్ గా నటించాడు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన గని మూవీలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాటను సంక్రాంతి సందర్భంగా 15న ఉదయం 11.08 గంటలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మామూలుగా తమన్నా ఐటమ్ సాంగ్ చేసిన సినిమాల్లో స్పీడున్నోడు తప్ప అన్నీ హిట్ అయ్యాయి. అంటే గనికి తమ్మూ సోయగాలు మరింత ఆకర్షణగా నిలవబోతున్నాయన్నమాట.
నటీనటులు: హమరేష్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులుసినిమాటోగ్రఫి: ఐ. మరుదనాయగంసంగీతం: సుందరమూర్తి కె.యస్ఎడిటింగ్: ఆర్.సత్యనారాయణనిర్మాత: శివ…
'Project Z' is one of Sandeep Kishan's hit movies list. This is the Telugu translation…
'Rayan' is the second film under the direction of veteran actor Dhanush. The first single…
నటీనటులు: సత్యదేవ్, లక్ష్మణ్ మీసాల, కృష్ణ బురుగుల, అర్చన అయ్యర్, అతీరా రాజ్, రఘు కుంచె, నంద గోపాల్, తారక్,…
Mass Ka Das Vishwak Sen is in good form among the young actors of today.…
Man of masses NTR upcoming movie 'Devara'. The team is going to start the campaign…