Reviews

‘సత్య‘ మూవీ రివ్యూ

నటీనటులు: హమరేష్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు
సినిమాటోగ్రఫి: ఐ. మరుదనాయగం
సంగీతం: సుందరమూర్తి కె.యస్
ఎడిటింగ్‌: ఆర్‌.సత్యనారాయణ
నిర్మాత: శివ మల్లాల
దర్శకత్వం: వాలీ మోహన్‌దాస్
విడుదల తేది: 10-05-2024

టీనేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఇక.. సహజత్వంతో కూడిన ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో తమిళులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటారు. ఈకోవలోనే.. గతంలో తమిళం నుంచి ‘ప్రేమిస్తే‘ వంటి సినిమాలు తెలుగులోకి అనువాదమై ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మరో తమిళ చిత్రం ‘రంగోలీ‘ తెలుగులో ‘సత్య‘ పేరుతో విడుదలైంది. ఈ సినిమాతో సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా మారారు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హమరేష్, ప్రార్థన, ఆడుకాలమ్ మురుగ దాస్, అమిత్ భార్గవ్, సంజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈరోజు (మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సత్య‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
పేద కుటుంబానికి చెందిన సత్యమూర్తి అలియాస్ సత్య (హమరేష్) ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతూ ఉంటాడు. అయితే.. ప్రభుత్వ కళాశాలలో ఎక్కువగా గొడవల్లో తలదూర్చుతున్నాడని తన కుమారుడిని ప్రైవేట్ కాలేజ్ లో చేరుస్తాడు తండ్రి గాంధీ (ఆడుగలం మురుగదాస్). గవర్న్ మెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ కాలేజ్ కి వెళ్లిన సత్య కి అక్కడ పరిస్థితులన్నీ కొత్తగా కనిపిస్తాయి. అదే సమయంలో అక్కడే చదువుతున్న పార్వతి (ప్రార్థన) ప్రేమలో పడతాడు. మరి సత్య.. పార్వతి ప్రేమను పొందాడా? అక్కడ తననే టార్గెట్ చేసిన గ్యాంగ్ ను ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు అదే కాలేజీలో చదువును కొనసాగించాడా? వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ అనగానే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమాలే కనిపిస్తాయి. ‘సత్య‘ కూడా అలాంటి టీనేజ్ లవ్ స్టోరీ. అయితే.. ఈ ప్రేమ కథకి తండ్రీకొడుకుల ఎమోషన్‌ని కూడా చేర్చి కొత్త ఫీల్ ను కలిగించాడు డైరెక్టర్ కమ్ రైటర్ వాలీ మోహన్ దాస్. కొడుకు భవిష్యత్ కోసం పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు పడే ఆవేదనను ఈ సినిమాలో ఆవిష్కరించాడు.

ప్రభుత్వ కళాశాలల్లో చదవడం నామోషీగా ఫీలయ్యే ఈ కాలపు పిల్లలు, తల్లిదండ్రుల మైండ్ సెట్ ను ఈ సినిమాలో చక్కగా చూపించారు. గవర్న్ మెంట్ కాలేజీ కంటే ప్రైవేట్ కాలేజీలో తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు.. ఫీజులు కట్టేందుకు వారు పడే బాధలను చూపించాడు దర్శకుడు. ఆ సన్నివేశాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి.

ఫస్టాఫ్ అంతా కాలేజీ వాతావరణాన్ని చూపించారు. అక్కడ జరిగే గొడవలు, ప్రేమకథలు, లెక్చరర్స్ – స్టూడెంట్స్ మధ్య ర్యాపో వంటివి ప్రతీ ఒక్కరి కాలేజ్ లైఫ్ ను గుర్తు చేసేలా ఉన్నాయి. ఇక.. సెకండాఫ్ లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
సత్యగా హమరేష్ బాగా చేశాడు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా.. టీనేజ్ బాయ్ గా నేచురల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. గవర్న్ మెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ కాలేజ్ కు వెళ్లడం.. అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే ప్రాబ్లమ్స్, లాంగ్వేజ్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులు వంటివి సత్య క్యారెక్టర్ లో సహజంగా పలికించాడు. పారు పాత్రలో ప్రార్థన క్యూట్ గా కనిపించింది. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్ర ‘ఆడుకాలం‘ మురుగదాస్ ది. తండ్రి గాంధీ పాత్రలో ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తిగా.. ఎంతో సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇంకా.. హీరో సిస్టర్, మదర్ రోల్స్ కూడా బాగున్నాయి.

సినిమాలోని పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక.. ఈ సినిమాని తెలుగు వారికి అందించడంలో.. డబ్బింగ్ విషయంలో నిర్మాత శివ మల్లాల చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

చివరగా
‘సత్య‘.. అందమైన కుటుంబ బాంధవ్యాలతో కూడిన క్యూట్ లవ్ స్టోరీ.

రేటింగ్ : 2.75/ 5

Telugu70mm

Recent Posts

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…

7 hours ago

బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…

8 hours ago

Pooja Hegde

8 hours ago

ఎన్టీఆర్ కు.. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే విషెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…

8 hours ago

ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…

8 hours ago