Powerpeta : విశ్వక్ సేన్ చేస్తున్నది నితిన్ వద్దన్న కథేనా..?

ఒక హీరో నో చెప్పిన కథ మరో హీరోకు నచ్చడం కామన్ గానేచూస్తున్నాం. విశేషం ఏంటంటే.. అలాంటి సందర్భాల్లోనే ఆ కథలు పెద్ద హిట్స్ గానూ నిలిచాయి. ఇలా మన స్టార్ హీరోలు కూడా సరిగ్గా అంచనా వేయలేక చాలాబ్లాక్ బస్టర్స్ ను వదులుకున్నారు కూడా. ప్రస్తుతం తెలుగులో ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు నితిన్. ఒక్క హిట్ పడితే వరుసగా డిజాస్టర్స్ చూసే హీరోల్లో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. అప్పుడెప్పుడు భీష్మతో విజయం అందుకుంటే ఆ తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాపులు పడ్డాయి.

ఆ టైమ్ లో అతను లిరిసిస్ట్ నుంచి దర్శకుడుగా మారిన కృష్ణ చైతన్యతో సినిమా కమిట్ అయ్యాడు. పవర్ పేట అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఎందుకో ఈ దర్శకుడికి నో చెప్పాడు నితిన్. ఆ డేట్స్ లో వక్కంతం వంశీతో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు భీష్మ కాంబినేషన్ లో మరో మూవీ వస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా ఈ చిత్రం రాబోతోంది.


అయితే ఆ కథను కృష్ణ చైతన్య వదల్లేదు. సితార బ్యానర్ లో వినిపించాడు. వారికి నచ్చింది. కట్ చేస్తే ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా సితార బ్యానర్ సినిమా నిర్మిస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఆ పోస్టర్ చూస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకూ విశ్వక్ చేయని పాత్రలా కనిపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఊరమాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్ కూడా మారింది. ఈ లుక్ చూసిన తర్వాత పవర్ పేట అనే టైటిల్ ను గుర్తు చేసుకుంటూ చాలామంది ఇది నితిన్ నో చెప్పిన కథే అంటున్నారు.


కృష్ణ చైతన్య చెప్పింది నిజంగానే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ఊరమాస్ ఎంటర్టైనర్. ప్రస్తుతం వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి.. ఈ తరహా ఎక్స్ పర్మెంట్స్ ఎందుకు అనుకున్నాడో లేక కథే నచ్చలేదే కానీ.. ఈ డైరెక్టర్ తో సినిమాకు నో చెప్పి ఉన్నాడు నితిన్. ఆ కథా వేరే కథా అనేది చెప్పలేం కానీ టాలీవుడ్ లో చాలామంది మాత్రం నితిన్ నో చెప్పిన కథతోనే విశ్వక్ సేన్ తో మూవీ చేస్తున్నాడు.. అంటున్నారు. మరి ఇది హిట్ అయితే నితిన్ మిస్ చేసుకున్న కథ అవుతుంది. లేదంటే లక్కీగా తప్పించుకున్న కథ అవుతుంది.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

1 hour ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

2 hours ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

2 hours ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago