Powerpeta : విశ్వక్ సేన్ చేస్తున్నది నితిన్ వద్దన్న కథేనా..?

ఒక హీరో నో చెప్పిన కథ మరో హీరోకు నచ్చడం కామన్ గానేచూస్తున్నాం. విశేషం ఏంటంటే.. అలాంటి సందర్భాల్లోనే ఆ కథలు పెద్ద హిట్స్ గానూ నిలిచాయి. ఇలా మన స్టార్ హీరోలు కూడా సరిగ్గా అంచనా వేయలేక చాలాబ్లాక్ బస్టర్స్ ను వదులుకున్నారు కూడా. ప్రస్తుతం తెలుగులో ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు నితిన్. ఒక్క హిట్ పడితే వరుసగా డిజాస్టర్స్ చూసే హీరోల్లో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. అప్పుడెప్పుడు భీష్మతో విజయం అందుకుంటే ఆ తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాపులు పడ్డాయి.

ఆ టైమ్ లో అతను లిరిసిస్ట్ నుంచి దర్శకుడుగా మారిన కృష్ణ చైతన్యతో సినిమా కమిట్ అయ్యాడు. పవర్ పేట అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఎందుకో ఈ దర్శకుడికి నో చెప్పాడు నితిన్. ఆ డేట్స్ లో వక్కంతం వంశీతో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు భీష్మ కాంబినేషన్ లో మరో మూవీ వస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా ఈ చిత్రం రాబోతోంది.


అయితే ఆ కథను కృష్ణ చైతన్య వదల్లేదు. సితార బ్యానర్ లో వినిపించాడు. వారికి నచ్చింది. కట్ చేస్తే ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా సితార బ్యానర్ సినిమా నిర్మిస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఆ పోస్టర్ చూస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకూ విశ్వక్ చేయని పాత్రలా కనిపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఊరమాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్ కూడా మారింది. ఈ లుక్ చూసిన తర్వాత పవర్ పేట అనే టైటిల్ ను గుర్తు చేసుకుంటూ చాలామంది ఇది నితిన్