రామ్ చరణ్, శంకర్ సినిమా రిలీజ్ డేట్ ఇదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్పాన్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే ప్యాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మార్కెట్ మరీ గొప్పగా లేదు. త్వరలో రాబోతోన్న ఆర్ఆర్ఆర్ తో తన మార్కెట్ డబుల్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు రామ్ చరణ్. అది కాకపోయినా ఆ తర్వాత వచ్చే మూవీ ఖచ్చితంగా తన రేంజ్ ను ప్యాన్ ఇండియన్ స్థాయిలో పెంచుతుందని బలంగా నమ్ముతున్నాడు. అందుకు కారణం శంకర్ డైరెక్షన్ లో చేస్తోన్న సినిమా. దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్రెడీ ఈ బ్యూటీ చరణ్ తో వినయవిధేయ రామలో రొమాన్స్ చేసింది. ఇక శంకర్ సినిమా అంటే అది రాజమౌళి రేంజ్ కు ఏ మాత్రం తక్కువగా ఉండదు. అతను కూడా ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ ఉన్నవాడే.
ఇక ఈ సినిమా ఇండియన్ బ్యూరోక్రాట్ సిస్టమ్ నేపథ్యంలో వస్తోందని ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్స్ తో పాటు రూమర్స్ ను బట్టి చూస్తే అర్థమౌతుంది. మామూలుగానే శంకర్ సినిమా అంటే భారీగా ఉంటుంది. పాటలకే ఓ మీడియం రేంజ్ సినిమా బడ్జెట్ ను ఖర్చుపెడుతుంటాడు. కాకపోతే నిర్మాత దిల్ రాజు కాబట్టి.. అలాంటి అవనసర ఖర్చుల విషయంలో ముందే ఓ అవగాహనకు వచ్చినట్టు ఆ మధ్య చెప్పుకున్నారు. అయినా కూడా శంకర్ సెట్స్ లోకి వెళ్లిన తర్వాత ప్రాపర్టీస్ ను డిమాండ్ చేసే టైప్. అందుకే ఎక్కువ ఖర్చవుతుంది. మొత్తంగా భారీ అంచనాలతో మొదలైన ఈ చిత్రం షూటింగ్ కూడా వేగంగానే సాగుతోంది. మరి షూటింగ్ స్పీడ్ గా అవుతోందంటే తర్వాత ప్రశ్న రిలీజ్ డేట్ గురించే కదా.. ?
ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి.. నిర్మాణ సంస్థ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే రామ్ చరణ్, శంకర్ ల సినిమాను వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ముందుగా ఈ యేడాది దసరాకు అనుకున్నా.. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు కేటాయించిన టైమ్ వల్ల ఆలస్య అయిందట. అందుకే కాస్త భారీగానే సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారని టాక్.

Related Posts