ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అద్భుత నటనతో పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అనిపించుకుంది. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ హ్యాట్రిక్ సెంటిమెంట్ ను బ్లాక్ బస్టర్ తో నిలబెట్టిందనే చెప్పాలి. కథ పరంగా శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన పుష్పకు బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రష్మిక మందన్నా నటనతో పాటు పరువాలు, బీ గ్రేడ్ రేంజ్ లో కనిపించిన సమంత ఐటమ్ సాంగ్ కూడా అదనపు ఆకర్షణగా నిలిచాయి. కాకపోతే ఎటొచ్చీ కథ విషయంలోనే పూర్తి క్లారిటీగా కనిపించలేదు. కేవలం దొంగతనంతో పాటు తన ఇంటి పేరు కోసం హీరో వెంపర్లాడటం తప్ప ఇదీ కథ అని ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి. అయినా సుకుమార్ టేకింగ్, ఆర్టిస్టుల ప్రతిభ వల్ల పుష్ప అంత పెద్ద విజయం సాధించింది. పైగా క్రిస్మస్ సెలవులు కూడా కలిసొచ్చాయి.
పుష్పకు మరో పార్ట్ కూడా ఉంటుందని ముందే చెప్పారు కదా. ఆల్రెడీ ఈ పార్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. అన్నీ కుదిరితే జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుందీ పార్ట్. సో.. వచ్చే దసరా వరకూ విడుదల కావొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రెండో పార్ట్ కూ సంబంధించి చాలా పార్ట్ చిత్రీకరించారట. ఇక ఈ పార్ట్ కు సంబంధించి ఓ కీలకమైన విషయం హల్చల్ చేస్తుంది.
పుష్ప ది రైజ్ లో అల్లు అర్జున్ హవాను చూపించారు. పుష్ప ది రూల్ లో కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపించినా.. ఆ పాత్రను చివరికి ఎండ్ చేయబోతున్నారట. అంటే అల్లు అర్జున్ పాత్ర చివరలో చనిపోతుందన్నమాట. దీనికి కత్తి పట్టిన వాడు కత్తి వల్లే పోతాడు అనే సామెను అన్వయిస్తూ.. అక్రమాలు చేసేవాడు ఎంతో కాలం అలాగే ఉండలేడు అనే పాయింట్ కు లింక్ చేస్తూ అల్లు అర్జున్ పాత్రనే అంతం చేయబోతున్నాడట సుకుమా. మరి ఇదే నిజమైతే ఈ సారి ఎమోషనల్ పార్ట్ కూడా యాడ్ అవుతుంది. అలాగే బన్నీ పాత్ర చనిపోవడం ఇంతకు ముందు లేదు. ఇదే మొదటిసారి కూడా అవుతుంది. మరోవైపు అతని పాత్ర రియలైజ్ అయ్యి .. తన తండ్రి కుటుంబం తనను ఒప్పుకున్న తర్వాత స్మగ్లింగ్ దందాను ముగించి వేరే వ్యాపకంలోకి వెళుతూ చివర్లో చిన్న సందేశం ఇచ్చేలానూ ప్లాన్ చేశారట. మరి నిజంగానే పుష్ప పాత్రను చంపడం ద్వారా ముగిస్తాడా లేక సందేశంతో అంతం చేస్తాడా అన్నది చూడాలి.
The Bharat Ratna Award is India's highest civilian award. Bharat Ratna is awarded to those…
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన…
Energetic star Ram, who came before the audience with last year's movie 'Skanda', is going…
Lady directors are now on the rise in the Telugu film industry. Veteran actresses like…
On one side, the heat of the election, on the other, IPL. With this, there…
Natasimham Balakrishna is not only the senior heroes of today. In the same momentum, he…