ఇంట్రెస్టింగ్ గా డ్రైవర్ జమున ట్రైలర్

మోస్ట్ టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న భామ ఐశ్వర్య రాజేశ్. తను ఎంచుకునే కథలు కూడా చాలా వైవిధ్యంగానే ఉంటాయి. ఆ వైవిధ్యమే తనకు రెగ్యులర్ హీరోయిన్లలాంటి అందం లేకపోయినా కోలీవుడ్ లోమంచి ప్లేస్ ఇచ్చింది. ఇటు తెలుగులోనూ ఐశ్వర్యకు చాలామంది అభిమానులే ఉన్నారు. కుటుంబం అంతా సినిమా పరిశ్రమకే చెందినా తను హీరోయిన్ అయిన తర్వాతే ఐశ్వర్యకు ఫ్యామిలీకి ఒక రేంజ్ వచ్చింది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ తో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తా చాటుతోన్న ఐశ్వర్య రాజేశ్ లేటెస్ట్ మూవీ “డ్రైవర్ జమున”. తమిళ్ లో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అవుతోంది. లేటెస్ట్ గా డ్రైవర్ జమున ట్రైలర్ విడుదల చేశారు.టాక్సీలకు సంబంధించి ఆడవాళ్లు కనిపించరు.

అది రిస్కీ జాబ్ కావడమే అందుకు కారణం. కానీ తనకు నచ్చిన పని చేయడం కోసం జమున క్యాబ్ డ్రైవర్ గా మారుతుంది. తన రోజు వారీ జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటన తన జీవితాన్నే మార్చేస్తుంది. అది కూడా కేవలం 90 నిమిషాల కాలంలో. ఓ పొలిటీషియన్ చంపేందుకు వచ్చిన ఓ ముఠా జమున క్యాబ్ బుక్ చేసుకుంటుంది. అసలే హంతకులైన వారి వల్ల జమున లైఫ్‌ లో జరిగిన సంఘటనలేంటీ..? హంతకులను ఎవరు,,ఎలా పట్టించారు అనే కోణంలో సాగే థ్రిల్లర్ ఈ సినిమా అని ట్రైలర్ చూస్తోంటే అర్థం అవుతుంది.ఎస్పీ చౌదరి ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ చిత్రానికి పి కిన్సిలిన్ డైరెక్టర్. గిబ్రన్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్ గా కనిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తోంటే ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్ కు కావాల్సిన సెటప్ అయితే కనిపిస్తుంది. మరి దాన్ని ఎంత గ్రిప్పింగ్ గా చెప్పారు అనే దాన్ని బట్టి ఈ డ్రైవర్ జమునకు బాక్సాఫీస్ వసూళ్లు ఉంటాయి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తోంటే డైరెక్ట్ మూవీస్ కే పెద్దగా కలెక్షన్స్ లేవు. మరి ఈ డ్రైవర్ రైడ్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts