ad

ఒకరు తప్పు చేశారు అని చెప్పడానికి అలాంటి తప్పును మనమూ చేసి చెప్పక్కర్లేదు. హుందాగా చెప్పొచ్చు. మరీ కోపం వస్తే కాస్త పరుషంగా మాట్లాడొచ్చు. కానీ దారుణమైన బూతు పదాలు వాడటం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. అదీ ఒక వయసుదాటిన తర్వాత కూడా. నలుగురికి మంచి చెప్పే వయసు, అర్హత కూడా ఉన్న టాలీవుడ్ టాప్ మ్యూజిక్ ఎమ్ఎమ్ కీరవాణి చేసింది ఇదే. ప్రస్తుతం తెలుగులో ఒక ట్వీట్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఆ ట్వీట్ చేసింది నేషనల్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి. ఇండియాలోని బెస్ట్ సౌండ్ రికార్డిస్టుల్లో రసూల్ ఒకడు. అలాంటి అతను ఆర్ఆర్ఆర్ గురించి రీసెంట్ గా ఓ అనుచితమైన ట్వీట్ చేశాడు. ఈ సినిమాను “గే లవ్ స్టోరీ”గా పోల్చాడు. దీనిపై ఇప్పటికే రసూల్ పై చాలామంది మండి పడుతున్నారు.బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఘాటుగానే అతనికి రిప్లై ఇచ్చాడు. అయితే ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మరో అడుగు ముందుకు వేసి అనకూడని పదజాలంతో రసూల్ పూకుట్టిని తిట్టేశాడు. రసూల్ చేసింది తప్పే. కానీ దాన్ని ఖండించడం ఇలా కాదు అని ఇప్పుడు జనం కీరవాణిపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే కీరవాణి తన ట్వీట్ లో తనకు అక్షరాలు సరిగా రాయరాదు అని చెబుతూ మొదలుపెట్టాడు. అలా చూసినా అది నిజం కాదు కదా. అందుకే కీరవాణి ట్వీట్ వైరల్ అవుతూనే విమర్శలకూ గురవుతోంది. ఏదేమైనా సెలబ్రిటీస్ కాస్త సంయమనంతో ఉంటేనే మంచిది. లేదంటే అనవసర విషయాలకు అభాసుపాలవుతారు.

, , , , , , ,