హ్యాపీ బర్త్ డే .. లావణ్య కు చివరి అవకాశమా..?

ఎంత పెద్ద సినిమాలకైనా రిలీజ్ టైమ్ లో కాంపిటీషన్ ఉంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కంటెంట్ పై ఎంత నమ్మకమున్నా.. అవతలి సినిమాలో ఎంత మేటర్ ఉందో తెలియదు కదా.. అందుకే కాస్త భయపడుతుంటారు. ఇది టాప్ మూవీస్ నుంచి స్మాల్ మూవీస్ వరకూ వర్తిస్తుంది. ఈ శుక్రవారం కూడా అలాగే జరుగుతోంది. కాకపోతే ఉన్నంతలో కాస్త లావణ్య త్రిపాఠికి అనుకూలంగా కనిపిస్తోంది. చూడ్డానికి చాలా సినిమాలు వస్తున్నా.. అందరి అటెన్షన్ ను తమవైపు తిప్పుకోగల సినిమాగా హ్యాపీ బర్త్ డే మాత్రమే ఉంది. మరి ఈ ఛాన్స్ అందాల రాక్షసికి అదృష్టాన్ని తెస్తుందా..?నాలుగైదు వారాలుగా తెలుగు సినిమా టఫ్ సిట్యుయేషన్స్ ను ఫేస్ చేస్తోంది. వస్తోన్న సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగానే మిగులుతున్నాయి. కాస్త అంచనాలున్న సినిమాలు సైతం ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో టాలీవుడ్ లో ఓ రకమైన నైరాశ్యం కనిపిస్తుంది. ఇక ఈ శుక్రవారం కూడా పేరుకు ఐదారు సినిమాలు విడుదలవుతున్నాయి. ఎప్పట్లానే వీటిలే ఒకటీ అరా తప్పా అందరికీ తెలిసిన సినిమాలు పెద్దగా లేవు. అందులో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన హ్యాపీ బర్త్ డే మాత్రం కాస్త ఎక్కువ అటెన్షన్ ను గ్రాబ్ చేసుకుంది. లావణ్యతో పాటు వెన్నెల కిశోర్, సత్య, నరేష్‌ అగస్త్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.హ్యాపీ బర్త్ డే సరియల్ కామెడీ అనే ఒక డిఫరెంట్ జానర్ లో వస్తోన్న సినిమా. అంటే ఇదంతా ఊహా ప్రపంచంలో జరిగే కథన్నమాట. అంటే లాజిక్కులు ఉండవు.

కాకపోతే ఈ తరహా చిత్రాలు తెలుగులో అరుదు. వర్కవుట్ అయితే అన్నీ నవ్వులే కనిపిస్తాయి. ఆడియన్స్ కు ఈ జానర్ అర్థమైతే ఆకట్టుకుంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకు ముందు మత్తువదలరా చిత్రంతో ఆకట్టుకున్న రితేష్‌ రానా డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. అతని దర్శకత్వంపై యూత్ లో కాస్త క్రేజ్ ఉంది. అది కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక అందరికంటే ఎక్కువగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే తన చేతిలో ఉన్న ఏకైక మూవీ ఇదే. ఇది కాస్తా తేడా కొడితే అమ్మడు ఇంక లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిందే.హ్యాపీ బర్త్ డే తో పాటు గంధర్వ అనే సినిమా కూడా వస్తోంది. జార్జిరెడ్డి, వంగవీటి వంటి చిత్రాలతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ ఈ చిత్రంలో హీరో. గాయత్రి ఆర్ సురేష్‌, శీతల్ భట్ హీరోయిన్లుగా నటించారు. పునర్జన్మల నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దీంతో పాటు జనాలకు పెద్దగా తెలియని మరో మూణ్నాలుగు సినిమాలు కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. వీటిలో కట్టప్ప సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ నటించిన మాయోన్ అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. మరి వీటిలో ఆడియన్స్ ను ఆకట్టుకునేవి ఏంటో కానీ.. ఈ ఫ్రైడే అయినా టాలీవుడ్ కు గుడ్ న్యూస్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts