విజయ్ దేవరకొండ కూడా మొదలుపెట్టేశాడు

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ దూకుడు పెంచుతున్నాడు. వరుస విజయాలతో ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ కు ఆ మధ్య రిపేర్ వచ్చాయి. హిట్స్ లాగానే కంటిన్యూస్ గా ఫ్లాప్స్ చూశాడు. దీంతో రూట్ మార్చి డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్యాంప్ లో చేరాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో లైగర్ మూవీ అనౌన్స్ అయింది. మొదట తెలుగు సినిమాగానే స్టార్ట్ అయినా.. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ఎంట్రీతో ఈ మూవీ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయింది. ఇక ఆ తర్వాత మూవీ రేంజ్ కూడా మారిపోయింది. అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ ను కూడా సెలెక్ట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రేక్షకుల దృష్టి లైగర్ పై పడింది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడున్న కాంపిటీషన్ ను దృష్టిలో పెట్టుకుని లైగర్ ప్రమోషన్స్ ను చాలా అర్లీగానే స్టార్ట్ చేస్తున్నారు.

ఈ నెల 11న లైగర్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ పాట ప్రోమోను ఇవాళ విడుదల చేస్తున్నారు. అకడ్ పకడ్ అంటూ సాగే ఈ గీతానికి సంబంధించి ఓ స్టిల్ కూడా విడుదల చేశారు. ఆ స్టిల్ చూస్తే విజయ్ ఇప్పటి వరకూ ఇలాంటి డ్యాన్స్ నంబర్స్ లో లేని విధంగా ఉన్నాడు. విజయ్ మంచి డ్యాన్సర్ కాదు. కానీ ఈ పాటలో అతని స్కిల్ చూపిస్తాడేమో అనేలా ఉన్నాడు. తెలుగు వెర్షన్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించారు. లైగర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మణిశర్మ అందిస్తుండగా పాటలకు మాత్రం ఇద్దరు సంగీత దర్శకులను తీసుకున్నారు. ఈ ఇద్దరూ బాలీవుడ్ వారే. విక్రమ్ మోన్ త్రోస్, తనిష్క్ బాగ్జిలతో పాటలు కంపోజ్ చేయించారు. ఇలాంటి మిక్స్ అన్నిసార్లూ వర్కవుట్ కాదు. మరి లైగర్ కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
ఇక పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ హిట్ తర్వాత చేస్తోన్న సినిమా ఇది. అటు విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత నటిస్తున్నాడు. విజయ్ కి మదర్ గా రమ్యకృష్ణ నటించింది. లైగర్ కు సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ ఉంది. సినిమాలో దానికి ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తారో కానీ.. మొత్తంగా లైగర్ చాలా అర్లీగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు.

Related Posts