పవర్ ఫుల్ డైరెక్టర్ తో ఐకన్ స్టార్ ..

ప్యాన్ ఇండియన్ మూవీస్ అనే మాట ఎప్పుడు మొదలైందో కానీ.. అప్పటి నుంచి ప్యాన్ ఇండియన్ లెవల్లో స్టార్స్ కూడా కలిసిపోతున్నారు. అంటే ఏ భాషలో వాళ్లు ఆ భాషలోనే కాక ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇందుకు హీరోలే కాదు.. డైరెక్టర్స్ కూడా మినహాయింపేమీ కాదు.

ఇప్పటికే తెలుగువాళ్లు తమిళ్ లో.. వాళ్లు మన దగ్గర సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో పవర్ ఫుల్ తమిళ్ డైరెక్టర్ మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది ఇంకా తేలాల్సి ఉన్నా.. కాంబినేషన్ క్రేజ్ మాత్రం అప్పుడే స్టార్ట్ అయింది.

సోషల్ ఇష్యూస్ ను కమర్షియలైజ్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టడంలో తమిళ్ డైరెక్టర్స్ దే పై చేయి. శంకర్ తర్వాత అలాంటి రేంజ్ కు వచ్చినట్టే వచ్చిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఇతను గజిని నుంచే తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు. అందుకే అతని సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. పైగా తెలుగులో నేరుగా రెండు సినిమాలు కూడా చేశాడు.

మెగాస్టార్ తో స్టాలిన్.. మహేష్ బాబుతో స్పైడర్. స్టాలిన్ మరింత పెద్ద విజయం సాధించాల్సి ఉన్నా.. చిరంజీవి ఇమేజ్ కోసమే పెట్టిన సన్నివేశాల వల్లే కాలేదనేది మురుగదాస్ చెప్పే మాట. ఇక స్పైడర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేంత డిజాస్టర్ గా నిలిచింది. బట్ ఈ రెండు సినిమాల్లోని ప్రధాన కథ మాత్రం చాలా చాలా బావుంటుందనే చెప్పాలి. అలాంటి దర్శకుడు అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అంటే ఖచ్చితంగా అది రెండు భాషల్లోనూ క్రేజీ న్యూసే అవుతుంది కదా.. అయ్యింది కూడా.

నిజానికి ఈ కథలోని మెయిన్ లైన్ ను మురుగదాస్ గతేడాదే అల్లు అర్జున్ కు చెప్పాడట. స్టోరీ ఐడియా అతనికి నచ్చింది. దీంతో బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నాడు మురుగదాస్. అది పూర్తయ్యాక బన్నీని కలుస్తాడు. ఈ లోగా బన్నీ పుష్ప2 పూర్తి చేస్తాడు. ఇది లేట్ అయినా మురుగదాస్ మరో ప్రాజెక్ట్ ను కూడా సెట్ చేసుకున్నాడట. ఆలస్యం అవుతుందనుకుంటే అటు వెళతాడు. లేదంటే బన్నీతోనే సినిమా ఉంటుంది. అన్నీ కుదిరితే ఈ యేడాది చివరి వరకూ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందట.

Related Posts