ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. ఇది కదా కావాల్సింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఒకటి ఊహించిందే అయినా మరోటి మాత్రం చాలామంది ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ రెండు అనౌన్స్ మెంట్స్ లోనూ ఎన్టీఆర్ ను నెక్ట్స్ లెవల్లో చూడబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. నిన్న కొరటాల శివతో సినిమా అనౌన్స్ అయింది. ఇవాళ ప్రశాంత్ నీల్ తో. ఈ కాంబో గురించి ఎంటైర్ టాలీవుడ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది.. ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ వేశారివాళ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా ఇప్పుడు దేశానికే పరిచయం అయ్యాడు. ఆర్ఆర్ఆర్ లో భీమ్ గా దేశం మొత్తం మెస్మరైజ్ అయ్యే నటనతో ఆకట్టుకున్నాడు. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని విజయాలతో దూసుకుపోయేందుకు ఇప్పుడు చేస్తోన్న సినిమాలు యూజ్ అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. విశేషం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రామ్ చరణ్ టీజర్ కు వాయిస్ ఓవర్ తోనే ఆకట్టుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు కొరటాల శివ సినిమాకూ అలాగే చేశాడు. అన్ని భాషల్లోనూ తనే డబ్బింగ్ చెప్పాడు. ఊరమాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని ఆ వాయిస్ తో పాటు విడుదల చేసిన విజువల్స్ చూస్తే తెలిసిపోతుంది.

సలార్ కంటే ముందే ఉంటుందనుకున్న ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ ది. మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఎప్పటి నుంచో వస్తుందనుకుంటోన్న సినిమా ఇది. కారణాలేంటో కానీ.. కాస్త ఆలస్యం అయింది. అయితేనేం.. ప్రశాంత్ ఇప్పటి వరకూ తీసిన సినిమాల కంటే మరో మెట్టు పైనే ఉండబోతోంది అనేలా హాఫ్ లుక్ తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దట్టమైన మీసకట్టు.. చురకత్తిలాంటి చూపుతో ఎన్టీఆర్ కు సంబంధించి విడుదల చేసిన ఈ హాఫ్ లుక్ అద్దిరిపోయిందనే చెప్పాలి. ఇక కొరటాల సినిమా ముందుగా మొదలవుతుంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ దసరా తర్వాత స్టార్ట్ అవుతుందంటున్నారు. మొత్తంగా అరవింద తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం చాలా టైమ్ వెచ్చించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో రంగంలోకి దిగుతున్నాడంటే ప్లానింగ్ వేరే ఉన్నట్టు అనుకోవాలి. ఎనీవే.. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

Related Posts